Bigg Boss OTT Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే..! ఇంకెవ‌రు ఆమే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss OTT Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే..! ఇంకెవ‌రు ఆమే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :13 March 2022,8:30 pm

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫ‌స్ట్ వీక్ లో ముమైత్ ఖాన్‌ని ఎలిమినేట్ చేసి ఇంటి బాట పట్టించారు బిగ్ బాస్. అయితే రెండో వారంలో నామినేషన్స్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఎంపిక అయ్యారు. అఖిల్, అషురెడ్డి, అరియానా, మహేష్ విట్టా, నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ, శ్రీపాక, హమీదా, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, సరయు ఉన్నారు. అయితే ఈ 11 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిన‌ట్లు స‌మాచారం.నిజానికి బిగ్ బాస్ ఎలిమినేషన్స్ అనేవి ఓటింగ్ ప్రకారం జరగవు అనేది సీజన్ 1 నుంచి జరుగుతూ వస్తున్న ప్ర‌చారం. బాగా ఆడే కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేసి.. రెమ్యునరేషన్, కంటెంట్ ఇలాంటి లెక్కలతో బాగా ఆడేవాళ్లని బయటకు పంపిస్తున్నార‌ని టాక్.

దీనికి తోడు ఓటింగ్స్ బాగా పడాలంటే ప్రతి వారం ఇద్దరు ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌లో ఉండేట్టుగా నామినేషన్స్ ప్రక్రియను జరిపిస్తుంటారు.రెండోవారం నామినేట్ అయిన 11 మందిలో అఖిల్, అషురెడ్డి, అరియానా, మహేష్ విట్టా, హమీదాలను సేఫ్ జోన్‌లో పెడతారు బిగ్ బాస్. మిగిలిన ఆరుగురిలో యాంకర్ శివ వివాదాల కోసమైనా కంటిన్యూ చేసేట్టుగా ఉన్నారు. వీళ్లకి బాగానే స్క్రీన్ స్పేస్ లభిస్తోంది. మిగిలిన వాళ్లతో పోల్చుకుంటే యాంకర్ శివకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హౌస్‌లో జరిగే గొడవలకు కేంద్ర బిందువుగా యాంకర్ శివ ఉంటున్నాడు కాబట్టి.. ఇతన్ని ఈవారం ఎలిమినేట్ చేయడం అయితే కష్టమే.ఇక మిగిలింది. మిత్రా శర్మ, అనీల్ రాథోడ్, సరయులు, శ్రీరాపాక.. అనీల్ రాథోడ్‌కి ఇప్పటికే హౌస్‌లో కొన్ని సీక్రెట్ లవ్ ట్రాక్‌లు సెట్ చేసి పెట్టారు..

Bigg Boss OTT Telugu this week eliminated

Bigg Boss OTT Telugu this week eliminated

Bigg Boss OTT Telugu : 11 మందిలో ..

వీళ్ల నుంచి మంచి మసాలా దట్టించేందుకు బిగ్ బాస్ కంటెంట్ క్రియేట్ చేసి పెట్టి ఉంచారు కాబట్టి.. అనీల్ రాథోడ్‌కి ఓట్లు పడినా పడకపోయినా ఎలిమినేట్ చేయడం అయితే కష్టమే అనిపిస్తోంది.మిగిలిన వాళ్లలో యాంకర్ శివకి ఓట్లు దండిగా పడుతున్నాయి. హౌస్‌లో సాఫ్ట్ అండ్ నీట్‌ గేమ్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్న బిందు మాధవితో శివ క్లోజ్‌గా ఉండటంతో.. ఆమె ఫ్యాన్స్ ఓటింగ్ శివవైపుకి మళ్లింది. పైగా గత సీజన్‌లో రన్నర్‌గా ఉన్న షణ్ముఖ్ ఫ్యాన్స్ ఓట్లు కూడా శివకే పడుతుండటంతో శివ టాప్ 3లో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో మిత్రా శర్మ, అనీల్ రాథోడ్, శ్రీరాపాక, సరయులు ఉన్నారు. అనీల్‌ని రెండోవారంలో కెప్టెన్‌ని చేశారు కనుక ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు.నిజానికి తొలివారంలోనే సరయుని ఎలిమినేట్ చేసినంత పనిచేశారు.. కానీ చివర్లో ముమైత్ ఎలిమినేషన్‌తో ఊపిరి పీల్చుకుంది. అయితే ఈవారంలో సరయుని నెగిటివ్‌గానే చూపిస్తున్నారు.

దీంతో సరయుకి ఎక్కువ ప్రమాదం ఉందనే చెప్పొచ్చు. అయితే ఐదో సీజన్‌లో తొలివారంలోనే ఎలిమినేట్ చేసి సరయుకి అన్యాయంచేసిన బిగ్ బాస్.. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయరనే అనిపిస్తుంది. అషురెడ్డి, అరియానా, స్రవంతి, శివ, అజయ్, అఖిల్ లాంటి వాళ్లు.. హౌస్‌లో పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు. షో చూసే ఆడియన్స్‌కి వీళ్ల బూతులతో పోల్చుకుంటే సరయు మాట్లాడేవి చాలా తక్కువే.. పైగా ఆమెను అంతా ఆడుకుంటున్నారనే సింపథీ పెరిగింది. దీంతో స‌ర‌యు ఈవారం ఎలిమినేషన్ నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.ఇక మిగిలింది శ్రీరాపాక, మిత్రా శర్మ.. రెండో వారంలో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓటింగ్ పరంగా చూస్తే.. మిత్రా శర్మ కంటే శ్రీరాపాకకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. టాస్క్‌‌లలో దూసుకుని పోతూ.. మగాళ్లని సైతం అల్లాడిస్తూ కనిపిస్తోంది శ్రీరాపాక.

స్క్రీన్ స్పేస్ కూడా బాగానే కల్పిస్తున్నారు. మిత్రా శ‌ర్మ ఆశించిన స్థాయిలో అయితే ఈ ఆట తీరు లేదు. ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టుగా పోటీపడుతోంది.అయితే రెండు వారాల్లో మిత్రా శర్మ అలియాస్ మిత్ర బింద మెరుగైన ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. తొలివారంలోనే మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుంద‌నుకున్నా.. అయితే ముమైత్ ఖాన్‌ని ఎలిమినేట్ చేశారు. అయితే ఈవారంలో పర్లేదు అనిపిస్తున్న శ్రీపాకని ఎలిమినేట్ చేస్తారని లీకైన సమాచారం. ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం మిత్రా శర్మ ఎలిమినేట్ కావాల్సిందే. ఏ పోల్ చూసుకున్నా మిత్రా శర్మకి ఎలిమినేట్ అవుతుందనే రిజల్ట్ వస్తుంది.. కానీ బిగ్ బాస్‌లో ఓటింగ్ లెక్కలు చెల్లవు కాబట్టి.. శ్రీరాపాకని బయటకు పంపిస్తున్నారనేది లీకైన సమాచారం.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది