Shanmukh : షన్ను ఇంట్లో తీవ్ర విషాదం.. దు:ఖంలో బిగ్ బాస్ కంటెస్టెంట్

Authored By aruna | The Telugu News | Published on: May 29, 2022, 8:00 pm

Shanmukh : బిగ్ బాస్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. షన్ను బామ్మ మరణించినట్టు తెలుస్తోంది. షన్ను గ్రాండ్ మదర్ తుది శ్వాస విడిచినట్టు సమాచారాం అందుతోంది. ఈ మేరకు షన్ను తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టేశాడు. ఈ మేరకు షన్ను చేసిన పోస్ట్ చూసి నెటిజన్లు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. షన్ను చేసిన పోస్ట్ చూసి, అందులో తన బామ్మతో ఉన్న రిలేషన్ చూసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. మామూలుగానే షన్ను ఈ మధ్య డిప్రెషన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు.అసలే దీప్తి సునయన బ్రేకప్‌తో షన్ను తీవ్రంగా బాధపడుతున్నట్టు కనిపిస్తోంది.

షన్నుని కాదని దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షన్ను మాత్రం ఇంకా దీప్తి సునయని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీదకు షన్ను వచ్చిన సమయంలోనూ దీప్తి సునయన టాపిక్ వచ్చినా తప్పించుకోకుండా సమాధానం చెప్పాడు. దీప్తి సునయనని త్వరలోనే కలుస్తాను అని అందరి ముందే ధైర్యంగా చెప్పేశాడు. అయితే షన్ను మాత్రం తాజాగా బాధపడుతున్నట్టు కనిపిస్తోంది.తనకు ఎంతో ఇష్టమైన బామ్మ చనిపోవడంతో రిప్ అని పెట్టేశాడు. హృదయం బద్దలైనట్టుగా ఎమోజీని షేర్ చేశాడు. తన పెళ్లి చూస్తావా? అని షన్ను అడిగితే. చూస్తానో లేదో.. అప్పటి వరకు ఉంటానో లేదో అని బామ్మ అన్నట్టుగా ఉంది.

Bigg Boss Shanmukh Grand Mother Passed Away

Bigg Boss Shanmukh Grand Mother Passed Away

నీ పెళ్లి వరకు ఉంటుంది.. పెళ్లి చూస్తుందని వెనకాల నుంచి మాటలు వినిపించాయి. కానీ షన్ను పెళ్లిని చూడకుండానే వెళ్లిపోయింది. మొత్తానికి షన్ను ఇంట్లో ఈ తీవ్ర విషాదం మాత్రం నేడు చోటు చేసుకుంది.షన్ను ప్రస్తుతం ఆహా యాప్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఏజెంట్ ఆనంద్ సాయి అంటూ రాబోతోన్నాడు. ఈ మధ్యే ఫస్ట్ లుక్ విడులైంది. గత రెండు వారాల క్రితం షన్ను గోవాలో ఎంజాయ్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసమే అక్కడకు వెళ్లినట్టు తెలుస్తోంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp