Bigg Boss Shanmukh On Agent Anand Sai and youtube
Bigg Boss Shanmukh : బిగ్ బాస్ ఇంట్లోకి రాక ముందు షణ్ముఖ్ జశ్వంత్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షన్ను యూట్యూబ్‌కు మెగాస్టార్ అని అతని అభిమానులు అంటుంటారు. సోషల్ మీడియాలో షన్నుకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. బిగ్ బాస్ షో అనేది షన్నుకి చిన్నది అని అంటుండే వారు. మొత్తానికి ఐదో సీజన్‌లో మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టేశాడు షన్ను. బిగ్ బాస్ షోకి వస్తే జీవితం తలకిందులవుతుందన్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో వల్ల ప్లస్ అవ్వొచ్చు.. మైనస్ అవ్వొచ్చు. షన్నుుకి మాత్రం విపరీతమైన నెగెటివిటీని తీసుకొచ్చింది.
చివరకు తన ప్రేమను కూడా దూరం చేసింది. బిగ్ బాస్ ఇంట్లో షన్ను వేసిన వేషాలకు దీప్తి సునయన హర్ట్ అయింది. బిగ్ బాస్ ఇంటి నుంచి షన్ను బయటకు రాగానే..బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునయన. అయితే షన్ను మాత్రం దీప్తి సునయనను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. తనను త్వరలోనే కలుస్తానంటూ చెప్పుకొస్తున్నాడు.ఇదంతా పర్సనల్ లైఫ్. ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతం షన్ను చేతిలో రకరకాల ప్రాజెక్టులున్నాయి. అయితే తాను యూట్యూబ్ నుంచి ఎదిగానని, యూట్యూబ్ తన ప్రపంచం అని చెప్పుకొచ్చాడు. తాను బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఎన్నో ఆఫర్లు వచ్చాయని, కానీ యూట్యూబ్‌లోనే తన మొదటి ప్రాజెక్ట్ చేస్తానని అన్నాడు.
Bigg Boss Shanmukh On Agent Anand Sai and youtube
అన్నట్టుగా తన ఫ్రెండ్, డైరెక్టర్ సుబ్బుతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేశాడు. ఏజెంట్ ఆనంద్ సాయి అంటూ ఓ ప్రాజెక్ట్ చేశాడు.ఇది అందరూ యూట్యూబ్ కోసమే అనుకున్నారు. కానీ తీరా అది ఆహాలో రాబోతోందని ప్రకటించారు. దీంతో యూట్యూబ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అంతేలే స్టేటస్ మారింది కదా? ఇక యూట్యూబ్‌ని పక్కన పెట్టేశాడనే కామెంట్లు ఎక్కువయ్యాయి.దీనిపై షన్ను స్పందించాడు. తాను యూట్యూబ్‌ని పక్కన పెట్టలేదని, ఏజెంట్ సీరిస్ అయ్యాక మళ్లీ వెంటనే యూట్యూబ్ సిరీస్.. యూట్యూబ్‌లో చేయడం మిస్ అవుతున్నాను.. కానీ కచ్చితంగా స్పెషల్‌తోనే మీ ముందుకు వస్తాను అని చెప్పుకొచ్చాడు.
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
This website uses cookies.