Bigg Boss 6 Telugu : త్వరలోనే బిగ్ బాస్ 6 స్టార్ట్.. కంటెస్టెంట్లు కన్ఫమ్ అయ్యారు.. ఎవరో తెలుసా?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 31 December 2021, 1:20 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ అయిపోయిందో లేదో.. వెంటనే బిగ్ బాస్ 6 కూడా ప్రారంభం కాబోతోంది. మరో రెండు నెలల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కూడా ప్రారంభం కాబోతోందని హోస్ట్ నాగార్జున కన్ఫమ్ చేశాడు. అయితే.. హోస్ట్ విషయంలో కూడా కాస్త సందిగ్ధం నెలకొన్నట్టు తెలుస్తోంది.కాకపోతే ఈ సారి కూడా హోస్ట్ గా నాగార్జుననే ఉంచాలని బిగ్ బాస్ యాజమాన్యం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే.. ఈసారి ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజన్ 6 ఓటీటీలో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా చానెల్ లో ప్రసారం అయ్యే ఎపిసోడ్ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.

ఆరోజు జరిగింది మొత్తం ఒక గంటలో మాత్రమే చూపిస్తారు. కానీ.. ఓటీటీ అలా కాదు. 24 గంటలు ఏం జరుగుతోందో మొత్తం చూపిస్తారు. 24 గంటల పాటు హౌస్ లో జరిగే విషయాలు అన్నీ తెలుసుకోవచ్చు.మరి.. బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ లోకి ఎవరు వెళ్తారు అనేదానిపై చాలా రోజుల నుంచి ఉన్న సస్పెన్స్ కు త్వరలోనే తెర పడనుందట. ఇప్పటికే కొందరి కంటెస్టెంట్ల పేరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ 6 ఓటీటీ సీజన్ లో పాల్గొనేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

bigg boss telugu 6 contestants details revealed

bigg boss telugu 6 contestants details revealed

Bigg Boss 6 Telugu : కంటెస్టెంట్లు కూడా కన్ఫమ్ అయ్యారా?

జబర్దస్త్ యాంకర్ వర్షిణి ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ శివ, డీ షో డ్యాన్సర్ రాజు, సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య లాంటి వాళ్లు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.వచ్చే ఫిబ్రవరి 6 నుంచి బిగ్ బాస్ 6 సీజన్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. కాకపోతే.. ఇది 100 రోజులు ఉండకపోవచ్చు. 50 రోజులు లేదంటే 80 రోజులు మాత్రమే ఉంటుందట. మిగితా కంటెస్టెంట్ల పేర్లను కూడా త్వరలోనే బిగ్ బాస్ యాజమాన్యం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి