Bigg Boss Telugu : బిగ్‌ బాస్‌ తెలుగు టీమ్ కు వైకాపా, టీఆర్‌ఎస్ లీడర్ల ఫోన్ లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu : బిగ్‌ బాస్‌ తెలుగు టీమ్ కు వైకాపా, టీఆర్‌ఎస్ లీడర్ల ఫోన్ లు

 Authored By prabhas | The Telugu News | Updated on :4 June 2022,8:30 pm

Bigg Boss Telugu : బిగ్‌ బాస్ తెలుగు సీజన్‌ 6 ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ లో సామాన్యులకు ఛాన్స్ అంటూ ప్రకటించారు. సామాన్యుల కోటాలో బిగ్ బాస్‌ హౌస్ లో జాయిన్‌ అయ్యేందుకు సెలబ్రెటీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్‌ బాస్ ద్వారా వచ్చే ప్రైజ్ మనీ కోసమో లేదా వారు ఇచ్చే పారితోషికం కోసమో కాదు… ఆ షో లో పాల్గొనడం వల్ల వచ్చే స్టార్ డమ్‌.. క్రేజ్ కోసం చాలా మంది అక్కడకు వెళ్లాలి కనీసం రెండు మూడు వారాలు అయినా ఉండాలి అని కోరుకుంటున్నారు.

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 6 లో ఛాన్స్‌ కోసం చాలా మంది సోషల్‌ మీడియా సెలబ్రెటీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సెలబ్రెటీలు అంతా కూడా ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ను డైరెక్ట్‌ గా లేదా ఇండైరెక్ట్‌ గా అప్రోచ్‌ అయ్యి అవకాశం ఇవ్వమంటూ అడుగుతున్నారట. కొందరు తమకు ఉన్న పలుకుబడిని కూడా ఉపయోగిస్తున్నారు అంటున్నారు. గతంలో ఒక సీజన్ లో మీడియాకు చెందిన ఒక వ్యక్తి బిగ్‌ బాస్ లో అడుగు పెట్టాడు. అప్పుడు ఆయన్ను ఒక రాజకీయ పార్టీ సిఫార్సు చేసిందని.. అందువల్ల ఆయన్ను తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

bigg boss Telugu season 6 contestants list

bigg boss Telugu season 6 contestants list

ఇప్పుడు అదే సిఫార్సును చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలు అయిన వైకాపా మరియు టీఆర్‌ఎస్ లకు చెందిన కొందరు నాయకులతో సన్నిహితంగా ఉండే సెలబ్రెటీలు వారి ద్వారా బిగ్‌ బాస్ లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారట. అందుకోసం వారు కూడా తమ వంతు సహకాయం అందించేందుకు గాను బిగ్‌ బాస్ టీమ్‌ ఫోన్ నెంబర్ లను పట్టుకుని ఫోన్ చేస్తున్నారట. కొందరు స్టార్‌ మా యాజమాన్యం ను పట్టుకుంటే కొందరు బిగ్‌ బాస్ టీమ్‌ వారితో చర్చలు జరుపుతున్నారట. కొందరు డబ్బును కూడా ఆఫర్‌ చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ 6 లో కంటెస్టెంట్స్ గా కనిపించడం కోసం చాలా మంది చాలా రకాలుగా కష్ట పడుతున్నారు. చివరి జాబితాలో ఎవరు ఉంటారో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది