Bigg Boss Telugu : ఆరుగురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. రెండోవారంలో ఊహించని ఎలిమినేషన్..!
Bigg Boss Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎనిమిదో సీజన్ రెండో వారం కూడా పూర్తి చేసుకునేందుకు సిద్ధమైంది. శుక్రవారంతో ఓటింగ్ ముగియగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. నామినేషన్స్ లో విష్ణుప్రియ, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, నిఖిల్,ఉన్నారు.బేబక్క ఎలిమినేషన్ అనంతరం హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. […]
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu : ఆరుగురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. రెండోవారంలో ఊహించని ఎలిమినేషన్..!
Bigg Boss Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎనిమిదో సీజన్ రెండో వారం కూడా పూర్తి చేసుకునేందుకు సిద్ధమైంది. శుక్రవారంతో ఓటింగ్ ముగియగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. నామినేషన్స్ లో విష్ణుప్రియ, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, నిఖిల్,ఉన్నారు.బేబక్క ఎలిమినేషన్ అనంతరం హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ ఆదివారం ఇంటిని వీడాల్సి ఉంది. విష్ణుప్రియ, నిఖిల్, నైనిక సేఫ్. వారికి అత్యధికంగా ఓట్లు పోల్ అయ్యాయి. మిగిలిన ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. శేఖర్ బాషా హౌస్లో ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు.
Bigg Boss Telugu రసవత్తరంగా..
అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. అనంతరం కిరాక్ సీతకు ఓట్లు పోల్ అయ్యాయి నాగ మణికంఠకు ఆరో స్థానం దక్కింది . అతడు కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు.ఇక డేంజర్ జోన్లో పృథ్విరాజ్, ఆదిత్య ఓం నిలిచారు. అనూహ్యంగా ఆదిత్య ఓం కంటే పృథ్విరాజ్ మెరుగైన ఓట్లు సంపాదించాడు. అంటే పృథ్విరాజ్ డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ ఆదిత్య ఓం కంటే ముందంజలో ఉన్నాడు. చూస్తుంటే ఆదిత్య ఓంనే ఈ వారం ఎలిమినేట్ అవుతాడని టాక్ ఉంది. ఇదిలా ఉంటే, వైల్డ్ కార్డ్ ద్వారా కొత్తగా మరో ఆరుగురు సెలబ్రిటీలు హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. అది కూడా మూడో వారంలో వచ్చే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఈ ఆరుగురిలో ఎక్కువగా జబర్దస్త్ అవినాష్ పేరు గట్టిగా వినిపిస్తోంది.
అతను ఇదివరకు రెండుసార్లు బిగ్ బాస్ హౌజ్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు వస్తే మూడోసారి అవుతుంది.జబర్దస్త్ అవినాష్‌ను కామెడీ పరంగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అతనిపాటు జబర్దస్త్ రోహిణి కూడా బిగ్ బాస్ 8 తెలుగులోకి వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టనుందని టాక్ వస్తోంది. మరి వైల్డ్ కార్డ్‌తో ఎవరెవరు వస్తారో చూడాలి.