Bigg Boss Telugu 8 : అనుకున్న సమయాని కన్నా ముందే బిగ్ బాస్ 8.. వేణు స్వామి ఉంటాడా లేదా..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం దగ్గర పడింది. సెప్టెంబర్ 1న సాయంత్రం 7గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ స్టార్ మా లో ప్రసారం కానుంది. సెప్టెంబర్ 8న ఫస్ట్ ఎపిసోడ్ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో అనుకున్న సమయానికి ముందే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. స్టార్ హీరోలు గెస్ట్స్ గా రానున్నారని సమాచారం. ఎప్పటిలాగే ఇతర హీరోయిన్స్, కంటెస్టెంట్స్ అదిరిపోయే పెరఫార్మన్స్లు ఇవ్వనున్నారు. హోస్ట్ నాగార్జున ఈసారి ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్స్ కి లిమిటే లేదు అంటున్నాడు.
ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమిటనేది షో మొదలైతే కానీ తెలియదు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. అలీ తమ్ముడు ఖయ్యూం, జబర్దస్ పవిత్ర, రీతూ చౌదరి, జబర్దస్త్ నరేష్, మై విలేజ్ షో అనిల్ గిల్లా, తేజస్విని గౌడ కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారట. అలాగే నయని పావని, వింధ్య విశాఖ, కిరాక్ ఆర్పీ, అమృత ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, బంచిక్ బబ్లు, నటి సోనియా సింగ్, హీరోయిన్ కుషిత కల్లపు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. కమెడియన్ అభినవ్ గోమఠం సైతం బిగ్ బాస్ 8కి ఎంపిక అయ్యాడంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. లాంచింగ్ ఎపిసోడ్ వరకు కంటెస్టెంట్స్ ఎవరు అనేది సీక్రెట్.
Bigg Boss Telugu 8 : అనుకున్న సమయాని కన్నా ముందే బిగ్ బాస్ 8.. వేణు స్వామి ఉంటాడా లేదా..!
మరి అందరూ అనుకుంటున్నట్లు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి ఈసారి హౌజ్ లోకి అడుగుపెడతాడా? తాజాగా ఓటీటీప్లే రిపోర్టు ప్రకారం.. ఈసారి వేణు స్వామి Venu Swamy కంటెస్టెంట్ గా ఉండబోవడం లేదు. తమ విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లుగా వెల్లడిస్తూ.. మొదట్లో వేణు స్వామి పేరును పరిశీలించినా.. ఎప్పుడైతే అతడు నాగ చైతన్య, శోభితలపై నోరు పారేసుకున్నాడో అప్పుడే అతని పేరుని తొలగించినట్లు తెలిపింది. సాధారణంగా ఇలాంటి వివాదాస్పద వ్యక్తులనే బిగ్ బాస్ లాంటి షోలకు పిలుస్తుంటారు. అయితే నాగార్జునే హోస్ట్ చేస్తున్న షో కావడం, అతని తనయుడు కాబోయే కోడలిపైనే వేణు స్వామి ఇలా నోరు పారేసుకోవడంతో అతన్ని పక్కన పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా అక్కినేని అభిమానుల్లోనూ అతనిపై పీకలదాకా కోపం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వేణు స్వామిని బిగ్ బాస్ లోకి పిలవడం సరికాదని భావించినట్లు సమాచారం.
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
This website uses cookies.