Bigg Boss Telugu 8 : అనుకున్న స‌మ‌యాని క‌న్నా ముందే బిగ్ బాస్ 8.. వేణు స్వామి ఉంటాడా లేదా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Telugu 8 : అనుకున్న స‌మ‌యాని క‌న్నా ముందే బిగ్ బాస్ 8.. వేణు స్వామి ఉంటాడా లేదా..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. సెప్టెంబర్ 1న సాయంత్రం 7గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ స్టార్ మా లో ప్రసారం కానుంది. సెప్టెంబర్ 8న ఫస్ట్ ఎపిసోడ్ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో అనుకున్న సమయానికి ముందే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 August 2024,7:00 pm

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. సెప్టెంబర్ 1న సాయంత్రం 7గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ స్టార్ మా లో ప్రసారం కానుంది. సెప్టెంబర్ 8న ఫస్ట్ ఎపిసోడ్ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో అనుకున్న సమయానికి ముందే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. స్టార్ హీరోలు గెస్ట్స్ గా రానున్నారని సమాచారం. ఎప్పటిలాగే ఇతర హీరోయిన్స్, కంటెస్టెంట్స్ అదిరిపోయే పెరఫార్మన్స్లు ఇవ్వనున్నారు. హోస్ట్ నాగార్జున ఈసారి ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్స్ కి లిమిటే లేదు అంటున్నాడు.

Bigg Boss Telugu 8 అంతా స‌స్పెన్స్..

ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమిటనేది షో మొదలైతే కానీ తెలియదు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. అలీ తమ్ముడు ఖయ్యూం, జబర్దస్ పవిత్ర, రీతూ చౌదరి, జబర్దస్త్ నరేష్, మై విలేజ్ షో అనిల్ గిల్లా, తేజస్విని గౌడ కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారట. అలాగే నయని పావని, వింధ్య విశాఖ, కిరాక్ ఆర్పీ, అమృత ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, బంచిక్ బబ్లు, నటి సోనియా సింగ్, హీరోయిన్ కుషిత కల్లపు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. కమెడియన్ అభినవ్ గోమఠం సైతం బిగ్ బాస్ 8కి ఎంపిక అయ్యాడంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. లాంచింగ్ ఎపిసోడ్ వరకు కంటెస్టెంట్స్ ఎవరు అనేది సీక్రెట్.

Bigg Boss Telugu 8 అనుకున్న స‌మ‌యాని క‌న్నా ముందే బిగ్ బాస్ 8 వేణు స్వామి ఉంటాడా లేదా

Bigg Boss Telugu 8 : అనుకున్న స‌మ‌యాని క‌న్నా ముందే బిగ్ బాస్ 8.. వేణు స్వామి ఉంటాడా లేదా..!

మరి అందరూ అనుకుంటున్నట్లు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి ఈసారి హౌజ్ లోకి అడుగుపెడతాడా? తాజాగా ఓటీటీప్లే రిపోర్టు ప్రకారం.. ఈసారి వేణు స్వామి Venu Swamy కంటెస్టెంట్ గా ఉండబోవడం లేదు. తమ విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లుగా వెల్లడిస్తూ.. మొదట్లో వేణు స్వామి పేరును పరిశీలించినా.. ఎప్పుడైతే అతడు నాగ చైతన్య, శోభితలపై నోరు పారేసుకున్నాడో అప్పుడే అతని పేరుని తొలగించినట్లు తెలిపింది. సాధారణంగా ఇలాంటి వివాదాస్పద వ్యక్తులనే బిగ్ బాస్ లాంటి షోలకు పిలుస్తుంటారు. అయితే నాగార్జునే హోస్ట్ చేస్తున్న షో కావడం, అతని తనయుడు కాబోయే కోడలిపైనే వేణు స్వామి ఇలా నోరు పారేసుకోవడంతో అతన్ని పక్కన పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా అక్కినేని అభిమానుల్లోనూ అతనిపై పీకలదాకా కోపం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వేణు స్వామిని బిగ్ బాస్ లోకి పిలవడం సరికాదని భావించినట్లు సమాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది