Bigg Boss Kaushal : ఈ బిగ్ బాస్ విన్నర్ పరిస్థితి మరీ ఇలా తయారయ్యిందేంటి గురూ..!
Bigg Boss Kaushal : తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ నిలిచిన విషయం తెల్సిందే. నటుడిగా, మోడల్ గా ఎన్నో కార్యక్రమాలు చేసి సీరియల్స్ లో నటించిన కౌశల్ కు రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా వచ్చింది. బిగ్ బాస్ లో కౌశల్ ఉన్న సమయంలో ఆయన పరోక్షంగా టార్గెట్ కాబడ్డాడు. అదే ఆయనకు కలిసి వచ్చిన అంశం. జనాల్లో సింపథి క్రియేట్ అయ్యింది. అది కాస్త ఓట్ల రూపంలో వచ్చింది. పైగా ఆయన తనకు నచ్చినట్లుగా ఉండేందుకు ఎక్కువ ప్రియార్టీ ఇచ్చాడు. అందువల్ల బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ మండా విజయాన్ని సొంతం చేసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బిగ్ బాస్ తెలుగు విన్నర్ గా కౌశల్ ఎంపిక అయిన సమయంలో ఏ రేంజ్ లో హడావుడి చేశాడో అందరికి తెల్సిందే. ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి కాల్.. గిన్నీస్ బుక్ రికార్డ్.. డాక్టరేట్ అంటూ ప్రకటనలు చేసి నవ్వుల పాలు అయ్యాడు. మరీ ఇలా చిల్లరగా కౌశల్ వ్యవహరించడం పట్ల అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆయన్ను నెటిజన్స్ ఏకి పారేశారు. కౌశల్ ఆర్మీ పేరు తో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అది అంతా గతం.. ఇప్పుడు ఆయన ఆర్థిక అవసరాల కోసం చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా కనిపించాల్సి వస్తుందని ఆయన సన్నిహితులు మరియు బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు.

Bigg Boss Winner kaushal manda in Sridevi drama company
ఆమద్య ఓంకార్ అన్నయ్య గేమ్ షో ఇస్మార్ట్ జోడీ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న కౌశల్ దంపతులు ఫైనల్ వరకు వెళ్లగలిగినా చివరి అడుగు మిస్ అయ్యింది. ఆ సమయంలో విజేతగా నిలువ లేక పోయారు. మళ్లీ ఇతర ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ లో కూడా బిగ్ బాస్ విన్నర్ కనిపిస్తున్నాడు. తాజాగా ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొన్నాడు. తాను మాత్రమే కాకుండా భార్యతో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేశాడు. భార్యతో కలిసి కౌశల్ చేసిన డాన్స్ వైరల్ అవుతుంది. వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కౌశల్ తన భార్యతో చేసిన సందడిని మనం చూడబోతున్నాం.