Chammak Chandra : చాలా రోజులకు మల్లెమాలలో చమ్మక్ చంద్ర.. వచ్చీ రావడంతోనే సెటైర్?

Authored By aruna | The Telugu News | Updated on : 26 August 2023, 8:00 pm

Chammak Chandra : బుల్లితెరపై ఆర్టిస్టులకు చాలానే ఆఫర్లు ఉంటాయి. కానీ శాశ్వతంగా ఆఫర్లు ఇచ్చేది.. ఎప్పుడూ డోర్లు తెరిచి ఉంచేది మాత్రం ఈటీవీ, మల్లెమాలనే. అందులోంచి ఎంతో మంది ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు.. పైకి ఎదిగారు.. మళ్లీ వేరే చోట్లకు వెళ్లారు.. కాలం కలిసి రాక మళ్లీ వెనక్కి వచ్చారు.. అలా ఎంతో మందిని మల్లెమాల అక్కున చేర్చుకుంటూనే ఉంది. అలా బయటకు వెళ్లి వచ్చిన వారి లిస్టులో చమ్మక్ చంద్ర కూడా చేరిపోయాడు. నాగబాబుతో కలిసి చమ్మక్ చంద్ర వెళ్లిన విషయం తెలిసిందే.

ఆ తరువాత స్టార్ మా, జీ తెలుగు వంటి చానెళ్లలో కొన్ని రోజులు షోలు చేశాడు. వాటిని చివరకు ఎత్తేశారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న చమ్మక్ చంద్రకు మళ్లీ మల్లెమాల అవకాశం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో చమ్మక్ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు. రాఖీ స్పెషల్‌గా చేసిన ఈ ఈవెంట్‌లో చంద్ర కనిపించాడు. ఏంటి మారిపోయాడు అనుకుంటున్నారా? సెట్ మారింది కానీ నేను మారలేదు అని ఎంట్రీతోనే కౌంటర్ వేశాడు.

Chammak Chandra Re Entry in Mallemala And Sridevi Drama Company

Chammak Chandra Re Entry in Mallemala And Sridevi Drama Company

చాలా రోజుల తరువాత చంద్రన్న మళ్ళీ రావడం ఆనందంగా ఉంది, చంద్రన్న స్కిట్స్ చూసే.. నేను జబర్దస్త్ చూసేవాడిని, చమ్మక్ చంద్ర గారు రావడం చాలా ఆనందంగా వుంది, చమ్మక్ చంద్ర గారు , చాలా రోజులయింది మిమ్మల్ని చూసి, చమ్మక్ చంద్ర గారు ఆయనతో పాటు రచ్చ రవి ఇలాగే షోలో కంటిన్యూ అయితే బాగుంటుంది.. హాయ్ చమ్మక్ చంద్ర భయ్యా, అప్పుడప్పుడైనా వీలు చూసుకుని జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీకి కొంచెం రా బ్రదర్ నీ కామెడీని చాలా మిస్ అవుతున్నాము అంటూ ఇలా నెటిజన్లు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి