Bigg Boss OTT Telugu : బిందు మాధవికి పెరుగుతున్న ఆధరణ.. ఈ వారం ఓట్లు చూసి షాక్ అయిన షో నిర్వాహకులు
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ 3 వారాలు కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు వారాల్లో ఇద్దరు ముగ్గురికి మంచి ఆదరణ లభించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది అనడంలో సందేహం లేదు. ఆమె పేరుతో ఏకంగా సోషల్ మీడియాలో ఆర్మీ నడుస్తుంది అంటే ఏ స్థాయిలో ఆమెకు గుర్తింపు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. స్లో అండ్ స్టడీ ఫార్ములాతో ఆమె దూసుకు పోతుంది. తన అవసరం ఉన్నచోట కచ్చితంగా వాయిస్ రైజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. ఈ అమ్మడు ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనల్ రేస్ లో నిలిచింది.
బిగ్ బాస్ ట్రోఫీ దక్కించుకుంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ సారి మాత్రం ఖచ్చితంగా ఈమె బలంగా ఫైనల్ వరకు ఉంటుంది అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం నిజమే అన్నట్టుగా తాజాగా ఆమెకు వచ్చిన ఓట్లు చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారంలో అత్యధిక ఓట్లు పొందిన మాధవి ప్రస్తుతం అనూహ్యంగా సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకుంది. ఆ క్రేజ్ను ఉపయోగించుకుంటూ ఆమె మరింతగా తన స్టార్డమ్ ను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.ముందు ముందు కూడా బిందు మాధవి నామినేషన్ లో ఉంటే సేవ్ అవడం ఖాయం. ఆమె మెంటాలిటీ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Bindu Madhavi get big amount of votes for this week in bigg boss OTT telugu non stop
కనుక ముందు ముందు ఆమె ను జనాలు మరింతగా ఆధరించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వారం వచ్చిన ఓట్ల విషయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు స్పందిస్తూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగడం ఆనందాన్ని కలిగించిందిని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ చరిత్ర లో ఇది అత్యధిక ఓటింగ్ అని.. బిందు మాధవికి దక్కిన ఓట్లు అత్యధికంగా ఉన్నాయని వారు అనధికారికంగా తెలియజేస్తున్నారు. ఈ వారం లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయానికి వస్తే ఎక్కువ ఉంది ఆర్ జే చైతూ అంటున్నారు. ఆయన అతి ప్రవర్తన మరియు ఓవరాక్షన్ తో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.