Bithiri Sathi : బీఆర్ఎస్‌లోకి బిత్తిరి సత్తి.. ఆ నియోజకవర్గం నుంచి టికెట్ కన్ఫమ్?
ప్రధానాంశాలు:
సీఎం కేసీఆర్ ను అందుకే బిత్తిరి సత్తి కలిశాడా?
మంత్రి కేటీఆర్, హరీశ్ రావుతోనూ భేటీ
ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? లేక వేరే పదవి ఇస్తారా?
Bithiri Sathi : బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీ6 తీన్మార్ వార్తలతో ఫేమస్ అయిన బిత్తిరి సత్తి ఇప్పుడు ఫేమస్ సెలబ్రిటీ అయిపోయాడు. ఒకప్పుడు బుల్లితెరకే పరిమితం అయిన బిత్తిరి సత్తి.. నేడు సినిమా సెలబ్రిటీ అయిపోయాడు. పలు సినిమాల్లోనూ బిత్తిరి సత్తికి సినిమా అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు బిత్తిరి సత్తి బుల్లితెరపై నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న సత్తి.. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. బిత్తిరి సత్తి ఫేమస్ యాంకర్ మాత్రమే కాదు.. ఫేమస్ కళాకారుడు కూడా. ఆయనంటే చాలామంది రాజకీయ నాయకులకు ఇష్టం. సత్తి చేసే కామెడీ అన్నా అందరికీ ఇష్టమే.
ప్రగతి భవన్ లో బిత్తిరి సత్తి నిన్న సీఎం కేసీఆర్ ను కలిశారు. మంత్రి కేటీఆర్, హరీశ్ రావుతోనూ భేటీ అయ్యారు. ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వాళ్లు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేయాలని మంత్రి కేటీఆర్, హరీశ్ రావు బిత్తిరి సత్తిని కోరినట్టు తెలుస్తోంది. దీంతో బిత్తిరి సత్తి కూడా దానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే బిత్తిరి సత్తి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే.. బిత్తిరి సత్తికి ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారా? లేక వేరే ఏదైనా పదవి ఇస్తారా అనేది తెలియదు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. టికెట్లు కూడా ఇచ్చేసింది.. కొందరికి బీఫామ్ లు కూడా ఇచ్చేసింది. ఈనేపథ్యంలో బిత్తిరి సత్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం అయితే లేదు కానీ.. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం బిత్తిరి సత్తికి బీఆర్ఎస్ పార్టీ ఏదైనా పార్టీలోనే వేరే పదవి ఇచ్చే అవకాశం ఉంది. త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో బిత్తిరి సత్తి పార్టీలో చేరే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.