Bobby : చిరంజీవి గారికి, బాల‌కృష్ణ గారికి తేడా ఇదే అని చెప్పిన బాబీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bobby : చిరంజీవి గారికి, బాల‌కృష్ణ గారికి తేడా ఇదే అని చెప్పిన బాబీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 November 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Bobby : చిరంజీవి గారికి, బాల‌కృష్ణ గారికి తేడా ఇదే అని చెప్పిన బాబీ..!

Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మారాడు. ప‌వ‌ర్ సినిమాకి బాబీ ప‌ని చేయ‌గా, ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం దొరికింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ అనే సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత బాబీకి వ‌రుస విజ‌యాలు ద‌క్కాయి. బాబీ చేసిన ఫిలిమ్స్ లు బెస్ట్ ఫిలిం అంటే వాల్తేరు వీరయ్య అని చెప్పాలి.

Bobby వారిద్ద‌రి మ‌ధ్య తేడా ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి చాలామంది రివ్యూవర్స్ చాలా తక్కువ రేటింగ్ ఇచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలన్నిటిలో కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెగాస్టార్ నుంచి అభిమానులకి ఏం కోరుకుంటారు అవి ప్రజెంట్ చేశాడు బాబి. ఇక నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘డాకూ మహారాజ్‌’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల టీజర్ విడుదల అయ్యి సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.

Bobby చిరంజీవి గారికి బాల‌కృష్ణ గారికి తేడా ఇదే అని చెప్పిన బాబీ

Bobby : చిరంజీవి గారికి, బాల‌కృష్ణ గారికి తేడా ఇదే అని చెప్పిన బాబీ..!

బాలకృష్ణ ను Balakrishna ఫ్యాన్స్‌ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించే ప్రయత్నం బాబీ చేస్తున్నాడని టీజర్ చూస్తేనే క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఆరంభం అయినప్పటి నుంచి పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. బాబీపై ఒకానొక సమయంలో ఫ్యాన్స్ విమర్శలు చేశారు. తాజాగా బాబీ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను బాలయ్య ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవి గారు కథలో కేవలం వేలు మాత్రమే కాకుండా బాడీ మొత్తం పెట్టేస్తారు. కథ ఏంటి.? సీన్ ఏంటి.? డైలాగ్స్ ఏంటి అని అంతగా సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ బాలకృష్ణ విషయానికి వస్తే డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఒక క్వశ్చన్ కూడా చేయడు. అది దర్శకుడికి ఇంకా ఎక్కువ బర్డెన్ పెంచుతుంది. ఇంకా కేర్ఫుల్ గా పనిచేసేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు బాబి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది