Daaku Maharaaj : డాకు మహారాజ్ హైలెట్ అదే.. సెంటిమెంట్ క్లిక్ అయితే రికార్డులే..!
ప్రధానాంశాలు:
Daku Maharaj : డాకు మహారాజ్ హైలెట్ అదే.. సెంటిమెంట్ క్లిక్ అయితే రికార్డులే..!
Daaku Maharaaj : నందమూరి బాలకృష్ణ Balakrishna లీడ్ రోల్ లో బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో మాస్ మూవీగా దిగుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. నందమూరి ఫ్యాన్స్ సంక్రాంతి పండగని డబుల్ జోష్ తో జరుపుకునేలా ఈ సినిమా ఉండనుంది.ఐతే డాకు మహారాజ్ Daku Maharaj ట్రైలర్ చూశాక సినిమా అంచనాలు డబుల్ అయ్యాయి. ఈ సినిమాలో హైలెటెడ్ అంశాల గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. డాకు మహారాజ్ సినిమాలో డాకు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తుంది. ఆ సీన్స్ ని బాబీ చాలా పవర్ ఫుల్ గా తీశాడని టాక్. అంతేకాదు యాక్షన్ సీన్స్ కూడా బాలకృష్ణ రెగ్యులర్ మాస్ ఫైట్స్ లా కాకుండా స్టైలిష్ గా తీశారని తెలుస్తుంది.
Daaku Maharaaj ఓ పక్క యాక్షన్ మరోపక్క సెంటిమెంట్..
ఇక సినిమాలో చిన్న పాప సెంటిమెంట్ కూడా ఉంటుందని ఓ పక్క యాక్షన్ మరోపక్క సెంటిమెంట్ ఈ రెండు ఉంటాయని అంటున్నారు. సినిమాలో ఇవే హైలెట్ కాగా అవి ఆడియన్స్ కు ఎక్కితే మాత్రం డాకు మహారాజ్ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అంటున్నారు. ఇప్పటికే డాకు మహారాజ్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉండగా సినిమా మరోసారి నందమూరి ఫ్యాన్స్ కి జోష్ ఇచ్చేలా ఉంది.
బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్ Pragya Jaiswal, ఊర్వశి రౌతెలా నటించారు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ మరోసారి ఈ కాంబో రీ సౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తుందని తెలుస్తుంది. మరి సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వీర ప్రతాపం చూపిస్తాడన్నది చూడాలి. నందమూరి బాలకృష్ణ ఇంకా డాకు మహారాజ్ టీం అంతా కూడా ఈ సినిమాపై సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. కచ్చితంగా బాలయ్య బాబు మాస్ మ్యాజిక్ చూపించేలా సినిమా ఉంటుందని అంటున్నారు. Balakrishna, Daku Maharaj, Bobby, Sitara Entertainments, Naga Vamsy