Daku Maharaaj : డాకు మహారాజ్ బిజినెస్ ఎంత.. ఎంత తెస్తే సూపర్ హిట్టో తెలుసా..?
ప్రధానాంశాలు:
Daku Maharaaj : డాకు మహారాజ్ బిజినెస్ ఎంత.. ఎంత తెస్తే సూపర్ హిట్టో తెలుసా..?
Daku Maharaaj : నందమూరి బాలకృష్ణ Balakrishna నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ను కె.ఎస్ బాబీ డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తుంది అంటే అది పక్కా హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడింది. డాకు మహారాజ్ ట్రైలర్ చూశాక నందమూరి ఫ్యాన్స్ లో అది మరింత బలంగా ఏర్పడింది. బాబీ మార్క్ యాక్షన్ సినిమాగా బాలయ్య తన ఊర మాస్ పంజా విసరబోతున్నాడని అనిపిస్తుంది. సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా నటించారు. డాకు మహారాజ్ Daku Maharaaj సినిమాకు థమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇప్పటికే సాంగ్స్ సూపర్ హిట్ కాగా బిజిఎం అదిరిపోతుందని అంటున్నారు….

Daku Maharaaj : డాకు మహారాజ్ బిజినెస్ ఎంత.. ఎంత తెస్తే సూపర్ హిట్టో తెలుసా..?
డాకు మహారాజ్ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం డాకు మహారాజ్ సినిమా వరల్డ్ వైడ్ గా 83 కోట్ల దాకా బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. సినిమా ఏపీ, తెలంగాణాలో 60 కోట్ల పైన రెస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్ మిగతా 23 కోట్ల బిజినెస్ జరిపిందని తెలుస్తుంది.
Daku Maharaaj : సినిమాపై ఉన్న బజ్
ఓవరాల్ గా డాకు మహారాజ్ సినిమా 83 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఉన్న బజ్ ఇంకా సినిమా ట్రైలర్ చూశాక కచ్చితంగా 84 కోట్లు బ్రేక్ ఈవెనే కాదు 100 కోట్లతో అదరగొట్టేస్తుందని అంటున్నారు. సితార నిర్మాత నాగ వంశీ Naga Vamsy అయితే డాకు మహారాజ్ సినిమాను బాలయ్య సమర సింహా రెడ్డితో పోల్చుతూ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి. సినిమాలో బాలయ్య లుక్ ఇంకా యాక్షన్ సీన్స్ అన్ని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాయి. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి గట్టి పోటీ ఇచ్చేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. Balakrishna, Daku Maharaaj, Daku Maharaaj Pre Release Event, Bobby, Naga Vamsy…