Brahmamudi 19 Aug Today Episode : రాజ్, కావ్య విడిపోయినట్టేనా.. రుద్రాణి, రాహుల్ పంతం నెగ్గిందా? రాజ్ తనను బయటికి గెంటేయడంతో కావ్య షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brahmamudi 19 Aug Today Episode : రాజ్, కావ్య విడిపోయినట్టేనా.. రుద్రాణి, రాహుల్ పంతం నెగ్గిందా? రాజ్ తనను బయటికి గెంటేయడంతో కావ్య షాకింగ్ నిర్ణయం

Brahmamudi 19 Aug Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 19 ఆగస్టు 2023 శనివారం ఎపిసోడ్ 179 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణి.. అపర్ణకు లేనిపోనివన్నీ ఎక్కించి చెబుతుంది. నీ కొడుకును నీకు కానివ్వకుండా చేస్తుంది నీ కోడలు అని రాజ్ మట్టి తొక్కే ఫోటోను అపర్ణకు చూపిస్తుంది. ఇలాగే ఉంటే నీ కొడుకు నీకు దక్కడు అని చెబుతుంది రుద్రాణి. దీంతో అపర్ణకు కోపం వస్తుంది. దీంతో […]

 Authored By gatla | The Telugu News | Updated on :19 August 2023,9:00 am

Brahmamudi 19 Aug Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 19 ఆగస్టు 2023 శనివారం ఎపిసోడ్ 179 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణి.. అపర్ణకు లేనిపోనివన్నీ ఎక్కించి చెబుతుంది. నీ కొడుకును నీకు కానివ్వకుండా చేస్తుంది నీ కోడలు అని రాజ్ మట్టి తొక్కే ఫోటోను అపర్ణకు చూపిస్తుంది. ఇలాగే ఉంటే నీ కొడుకు నీకు దక్కడు అని చెబుతుంది రుద్రాణి. దీంతో అపర్ణకు కోపం వస్తుంది. దీంతో ఏం చేయాలో అపర్ణకు అర్థం కాదు. వెంటనే రాజ్ కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రా అంటుంది. ఏమైంది అంటాడు రాజ్. దీంతో చెప్తే కానీ రావా అంటుంది అపర్ణ. దీంతో సరే వస్తున్నా అని ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో ఇంటికి వస్తుంది కావ్య. రాగానే చేయి అడ్డు పెట్టి ఆపుతుంది అపర్ణ. చివరకు నీ స్థాయికి నా కొడుకును దిగజార్చావా అని కావ్యను నిలదీస్తుంది అపర్ణ. దీంతో రోజూ నేను ఇంటికి రాగానే నన్ను ప్రశ్నించడం అలవాటు అయింది. అసలు నాది అంత దారుణమైన స్థాయా? అంటూ ప్రశ్నిస్తుంది కావ్య.

brahma mudi 19 august 2023 saturday full episode

నేను ఏం చేశాను అని అడుగుతుంది కావ్య. దీంతో నువ్వు ఏం చేశావో నీకు తెలియదా అంటుంది అపర్ణ. నా కొడుకును పావుగా మార్చి నీ కుటుంబంలో కలిపేసి కూలివాడిగా మార్చితే నేను నిన్ను క్షమించేదే లేదు అంటుంది అపర్ణ. ఇదంతా రుద్రాణి, రాహుల్ పని అని తెలుసుకొని వాళ్ల మీద విరుచుకుపడుతుంది కావ్య. మా అత్తయ్యకు నా మీద లేనిపోని వన్నీ చెప్పేది ఎవరో నాకు బాగా తెలుసు అంటుంది కావ్య. అసలు మీ సమస్య ఏంటి అత్తయ్య. నేను డిజైన్స్ వేసి ఆ డబ్బు మా ఇంట్లో ఇస్తే మీకు నచ్చదు. ఎక్కడ మేమిద్దరం ఒక్కటైపోతామేమోనన్న భయం. ఏదైనా చిన్న పొరపాటు పడితే మీ కొడుక్కి మీరు భూతద్దంలో చూపించి నన్ను మాటలు అనిపించే వరకు నిద్రపోరు. మీకు నేను ఎప్పటికీ కోడలుగా పనికిరాను. అందుకని మీ కొడుకు నన్ను ఎప్పుడూ భార్యగా చూడకూడదా? మా ఇద్దరిని విడదీసి నన్ను బయటికి గెంటేసి మీ కసి తీర్చుకోవాలని అనుకుంటున్నారా? అసలు మీ కొడుక్కి మీరు కన్న తల్లేనా? అంటూ కాస్త గట్టిగానే ప్రశ్నిస్తుంది కావ్య.

ఇంతలో ఏమన్నావు అంటూ వచ్చి కావ్యను కొట్టబోతాడు రాజ్. కట్ చేస్తే మూర్తి ఇంట్లో కూర్చొని ఉంటాడు. వర్షం పడేలా ఉండటంతో సామాన్లు అన్నీ ఇంట్లో సర్దుతుంటాడు. తన భార్య కనకాన్ని పిలుస్తాడు. త్వరగా రా కనకం.. రంగులు వెలిసిపోతాయి అంటాడు. తొందర తొందరగా బొమ్మలు తీయబోతుంటాడు మూర్తి. కానీ.. అతడికి చేతగాదు. దీంతో మీరు కూర్చోండి. నేను తీస్తాను కానీ అంటుంది కనకం. అప్పు ఎక్కడికి వెళ్లింది అంటే తెలియదు.. అదేమైనా చెప్పి వెళ్తుందా అంటుంది కనకం. ఇంతలో బొమ్మలు తీసుకొని ఇంట్లో పెట్టేందుకు వెళ్లబోతుండగా కాలు జారి బొమ్మ కింద పడి పగిలిపోతుంది. దీంతో కనకానికి ఏం చేయాలో అర్థం కాదు. పర్వాలేదులే కనకం. నువ్వు కావాలని చేయలేదు కదా అంటాడు మూర్తి.

Brahmamudi 19 Aug Today Episode : కావ్యను ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన రాజ్

అమ్మాయి ఎంతో కష్టపడి రంగులు వేసింది కదా. దేవుడి విగ్రహం పగిలిపోయింది అంటే నాకు ఏదో కీడు అనిపిస్తోంది అంటుంది కనకం. తనకు ఏదో తేడా అనిపిస్తుంది. నా మనసుకు ఏదో చెడు జరగబోతోంది అనిపిస్తోంది అంటుంది కనకం. దీంతో అలాంటిదేం జరగదులే అంటాడు మూర్తి. మరోవైపు మా తాతయ్య నేర్పని సంస్కారం గుర్తుంది కాబట్టి బతికిపోయావ్ అంటాడు రాజ్. ఏమన్నావు మా అమ్మను ఏమన్నావు అంటే.. నేను ఈ ఇంట్లో ఉండటం మీ అమ్మకు ఇష్టం లేదు అంటుంది కావ్య. దీంతో అవునా.. నువ్వు ఈ ఇంట్లో ఉండటం నాకే ఇష్టం లేదు అంటాడు రాజ్. దీంతో రుద్రాణి, రాహుల్, స్వప్న సంతోషిస్తారు.

నువ్వు నాకు భార్యగా నచ్చనప్పుడు మా అమ్మ నిన్ను కోడలుగా ఎందుకు ఒప్పుకోవాలి అని అంటాడు రాజ్. ఆవిడ ఏమైనా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చూపుల్లో చూసి పెద్ద వాళ్లతో మాట్లాడి ఈ పెళ్లి జరిపించిందా? అయినా సరే తను నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చింది. కానీ.. నువ్వు ఏం చేశావు. నీ పుట్టిల్లు.. నీ ఆత్మ గౌరవం అంటూ మా అందరినీ బజారుకెక్కించావు. అయినా కూడా మా అమ్మ ఊరుకొని ఉంది. అలాంటి మా అమ్మను ఇలాంటి వ్యాఖ్యలు అంటావా? నువ్వెంత, నీ స్థాయి ఎంత. ఈ ఇంటికి మహారాణిలా బతికింది మా అమ్మ. ఇన్నాళ్లు నేను అన్నీ సహించాను. కానీ.. నువ్వు మా అమ్మనే అనే స్థాయికి వెళ్లావు. ఈ ఇంటికి ఒక విలువ, గౌరవం ఉన్నాయి. నీకు ఈ ఇంట్లో స్థానమే లేదు. వెళ్లు వెళ్లిపో అంటాడు రాజ్.

ఇందులో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని కావ్యను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. దీంతో నేను ఎక్కడికి వెళ్లాలి అంటే నీ ఇంటికి వెళ్లు అంటాడు. దీంతో నా ఇల్లు ఇదే అంటుంది. నేను ఎక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటా అంటుంది కావ్య. డోర్ వేసి రాజ్ ఇంట్లోకి వెళ్తాడు. ఇంతలో వర్షం స్టార్ట్ అవుతుంది. తను అక్కడే గుమ్మం ముందే వర్షంలో తడుస్తూ నిలబడుతుంది.

ఇంతలో కళ్యాణ్ వచ్చి ఏంటి అంటాడు రాజ్ తో. వదిన ఏ తప్పు చేయలేదు అంటాడు కళ్యాణ్. కట్టుకున్న భార్యను చీకట్లో, వర్షంలో గెంటేయడం తప్పు అంటాడు కళ్యాణ్. పాపం అన్నయ్య అన్నా కూడా వినడు రాజ్. వర్షంలో తడుస్తున్న కావ్య దగ్గరికి మూర్తి, కనకం వస్తారు. కావ్యా.. నీకు ఇంత శిక్ష వేస్తారా? వీళ్లు మనుషులా రాక్షసులా అని కావ్యను తీసుకొని ఇంట్లోకి వెళ్తారు మూర్తి, కనకం. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది