Brahma Mudi 31 July Monday Episode Highlights : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. బ్రహ్మముడి జులై 31, 2023 సోమవారం ఎపిసోడ్ 162 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దుర్గిరాల ఫ్యామిలీలో స్వప్న చేసిన యాడ్ గురించే చర్చ నడుస్తూ ఉంటుంది. చివరకు తన తల్లి కనకం కూడా ఇంటికి వచ్చి మరీ అందరి ముందు స్వప్నను తిట్టి వెళ్తుంది. అసలు నువ్వు నా కడుపులో ఎలా పుట్టావు అని చీదరించుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. స్వప్న ఎంత తప్పు చేసినా దుగ్గిరాల ఫ్యామిలీ మాత్రం తనకు సపోర్ట్ గానే నిలబడుతున్నారు. ఆ విషయం రాహుల్, రుద్రాంగికి నచ్చదు.
మరోవైపు రాజ్ వచ్చి ఆ సమస్య తీరిపోయిందని.. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు బయటపడకుండా ఉండేందుకు స్వప్న నటించిన యాడ్ టెలికాస్ట్ కాకుండా రూ.30 లక్షలు కట్టి వచ్చా అని చెబుతాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ.. ఆ విషయం స్వప్నకు నచ్చదు. నా యాడ్ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు అని రాజ్ ను పలు మాటలు అంటుంది స్వప్న. దీంతో అను కలగజేసుకొని నా భర్తను అనే హక్కు నీకెవరు ఇచ్చారంటూ స్వప్నపై సీరియస్ అవుతుంది.
Brahma Mudi 31 July Monday Episode Highlights : పెద్దమనుషులను తీసుకొని కనకం ఇంటికి వచ్చిన సేటు
కట్ చేస్తే ఎలాగైనా అను, స్వప్నకు మధ్య గొడవ పెట్టించాలని రాహుల్, రుద్రాంగి ప్రయత్నాలు చేస్తుంటారు. తనను ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. తన రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ ఉన్న స్వప్నను ఓదార్చుతున్నట్టుగా నటించిన రాహుల్.. అను గురించి లేనిపోనివి తనకు చెబుతాడు. నువ్వు ఎదగడం తనకు ఇష్టం లేదని.. ఏదేదో చెబుతాడు. అవన్నీ విన్న స్వప్న నిజమే అని నమ్ముతుంది.
మరోవైపు కనకం ఇంటికి సేటు చంపక్ లాల్ వస్తాడు. ఆ ఊరు పెద్దమనుషులను ఇద్దరిని తీసుకొని వస్తాడు. నా దగ్గర 10 లక్షల అప్పు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వలేదని.. వడ్డీ కూడా 50 వేలు అయిందని అంటాడు. వడ్డీ, అసలు వెంటనే ఇవ్వాలని లేకపోతే ఈ ఇల్లు రాసి ఇవ్వాలని అంటాడు.
దీంతో మేము ఇల్లు అస్సలు ఇవ్వం అంటుంది కనకం. లేకపోతే పోలీస్ స్టేషన్ కు వెళ్తా అని బెదిరిస్తాడు. పెద్దమనుషులు సర్దిచెబుతారు అతడికి. ఆ తర్వాత ఆరు నెలల్లో 10 లక్షలు ఇచ్చేలా, దానికి అయిన వడ్డీ రూ.50 వేలు రెండు రోజుల్లో ఇవ్వాలని కండిషన్ పెడతారు. ఒకవేళ రెండు రోజుల్లో 50 వేల వడ్డీ ఇవ్వకపోతే తనను కిడ్నాప్ చేసిన సీసీకెమెరా వీడియో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా అని కృష్ణమూర్తి, కనకాన్ని బెదిరిస్తాడు సేటు. రెండు రోజుల్లో రూ.50 వేలు ఇవ్వాలని.. అక్కడ ఇంట్లో పరిస్థితులు బాగా లేవని అనుకు తెలుస్తుంది. ఆ 50 వేలు ఎలా తేవాలని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.