Brahmaji : కమెడీయన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు నటుడు బ్రహ్మాజీ.కామెడీ అయిన విలనిజం అయిన తనదైన నటనతో మెప్పించాడు బ్రహ్మాజీ. ఇతగాడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనే మరింత బిజీగా ఉంటున్నాడు. రకరకాల పాత్రలను పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పైగా బ్రహ్మాజీ కనిపించిన ప్రతీ సినిమా దాదాపుగా హిట్ అవుతోంది.బ్రహ్మాజీ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఉంటాడు. బ్రహ్మాజీ పోస్ట్‌లకి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంటుంది. అయితే ఒక్కోసారి ఆయన చేసే పోస్ట్‌లు వివాదం కూడా అవుతుంటాయి.
తాజాగా దేశీయ విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ (ఎయిరిండియా అనుబంధ సంస్థ)పై టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చండీగఢ్ నుంచి కులూ వెళ్లాలని భావించానని, అయితే మూడు గంటలకు పైగా వేచి చూస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా విమానం రాలేదని అసహనం వెలిబుచ్చారు. సదరు సంస్థ నుంచి ముందస్తుగా ఎలాంటి సమాచారం అందలేదట. అలా తమను వెయిట్ చేయించిందని, కనీసం ప్రయాణీకుల అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలు కూడా చెప్పలేదని బ్రహ్మాజీ ఇలా వరుసగా ట్వీట్లు వేసుకుంటూ వచ్చాడు.
చివరిగా మొత్తానికి ఐదున్నర గంటల తరువాత ఆలస్యంగా ఫ్లైట్ వచ్చింది.. నేను అలియన్స్ ఏయిర్ నుంచి ఎలాంటి రిప్లైలను కూడా ఆశించడం లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అంటూ సెటైర్లు వేశాడు. బ్రహ్మాజీకి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ కూడా తిరగాలనే ధ్యేయం పెట్టుకున్నట్టున్నాడు. తన సంపాదన అంతా కూడా ట్రావెలింగ్ కోసం ఖర్చు పెడతానని, తాను డబ్బు కూడబెట్టుకోనని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ స్టార్ హీరోల సినిమాలలో కూడా ముఖ్య పాత్రలు పోషిస్తూ అందరిని మెప్పిస్తున్నాడు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.