Brahmaji : బ్ర‌హ్మాజీకి ఇంత ధైర్యం ఎక్క‌డిది.. ప్ర‌భుత్వ సంస్థ‌నే టార్గెట్ చేశాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmaji : బ్ర‌హ్మాజీకి ఇంత ధైర్యం ఎక్క‌డిది.. ప్ర‌భుత్వ సంస్థ‌నే టార్గెట్ చేశాడుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :30 August 2022,4:40 pm

Brahmaji : క‌మెడీయ‌న్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు న‌టుడు బ్ర‌హ్మాజీ.కామెడీ అయిన విల‌నిజం అయిన త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు బ్ర‌హ్మాజీ. ఇత‌గాడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనే మరింత బిజీగా ఉంటున్నాడు. రకరకాల పాత్రలను పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పైగా బ్రహ్మాజీ కనిపించిన ప్రతీ సినిమా దాదాపుగా హిట్ అవుతోంది.బ్ర‌హ్మాజీ సోష‌ల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తికర కామెంట్స్ చేస్తూ ఉంటాడు. బ్ర‌హ్మాజీ పోస్ట్‌ల‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంటుంది. అయితే ఒక్కోసారి ఆయ‌న చేసే పోస్ట్‌లు వివాదం కూడా అవుతుంటాయి.

Brahmaji : బ్ర‌హ్మాజీ సెటైర్స్..

తాజాగా దేశీయ విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ (ఎయిరిండియా అనుబంధ సంస్థ)పై టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చండీగఢ్ నుంచి కులూ వెళ్లాలని భావించానని, అయితే మూడు గంటలకు పైగా వేచి చూస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా విమానం రాలేదని అసహనం వెలిబుచ్చారు. సదరు సంస్థ నుంచి ముందస్తుగా ఎలాంటి సమాచారం అందలేదట. అలా తమను వెయిట్ చేయించిందని, కనీసం ప్రయాణీకుల అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలు కూడా చెప్పలేదని బ్రహ్మాజీ ఇలా వరుసగా ట్వీట్లు వేసుకుంటూ వచ్చాడు.

Brahmaji Satires On Air Lines In Twitter

Brahmaji Satires On Air Lines In Twitter

చివ‌రిగా మొత్తానికి ఐదున్నర గంటల తరువాత ఆలస్యంగా ఫ్లైట్ వచ్చింది.. నేను అలియన్స్ ఏయిర్ నుంచి ఎలాంటి రిప్లైలను కూడా ఆశించడం లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అంటూ సెటైర్లు వేశాడు. బ్రహ్మాజీకి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ కూడా తిరగాలనే ధ్యేయం పెట్టుకున్నట్టున్నాడు. తన సంపాదన అంతా కూడా ట్రావెలింగ్‌ కోసం ఖర్చు పెడతానని, తాను డబ్బు కూడబెట్టుకోనని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం బ్ర‌హ్మాజీ స్టార్ హీరోల సినిమాల‌లో కూడా ముఖ్య పాత్ర‌లు పోషిస్తూ అంద‌రిని మెప్పిస్తున్నాడు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది