Brahmamudi 18 Sep Monday Episode : కావ్య వల్లనే వేరుకాపురం పెట్టాల్సి వస్తోందని అపర్ణ షాకింగ్ నిర్ణయం.. దుగ్గిరాల ఫ్యామిలీ ముక్కలు

Advertisement

Brahmamudi 18 Sep Monday Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 18 సెప్టెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 204 తాజాగా విడుదలైంది. లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవైపు స్వప్న ఎక్కడికి వెళ్లిందో కనకానికి అర్థం కాదు. ఫోన్ చేస్తే కలవదు. కావ్య ఇంట్లో ఏం జరుగుతోందో కూడా కనకానికి, మూర్తికి తెలియదు. కావ్య కూడా తమ ఇంట్లో జరుగుతున్న విషయాలను కనకానికి చెప్పదు. చెబితే టెన్షన్ పడతారని తాను సంతోషంగానే ఉన్నట్టుగా చెబుతుంది కావ్య. మరోవైపు స్వప్న టెన్షన్. స్వప్న, రాహుల్ ఇద్దరూ కలిసి చేస్తున్న ప్లాన్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వాళ్ల ప్లాన్ ఏంటో రుద్రాణికి తప్పితే మరెవరికీ తెలియదు. ఎవరు ఫోన్ చేసినా స్వప్న ఫోన్ కలవకపోవడంతో ఇక తన గురించి ఆలోచించడం మానేస్తారు అందరు.

Advertisement
brahmamudi 18 sept 2023 monday full episode
verekapuram

ఇదంతా పక్కన పెడితే దుగ్గిరాల ఫ్యామిలీ మాత్రం ముక్కలు అయిపోయింది. ఎందుకంటే.. ఎప్పుడూ లేనిది అపర్ణ తన వంట తానే చేసుకోవడం, ఎవ్వరితో మాట్లాడకపోవడం, రుద్రాణి వచ్చి మళ్లీ తనను రెచ్చగొట్టడం చేస్తుంది. ఇక నుంచి ఈ ఇంట్లో నేనొక్కదాన్నే.. నేను ఒంటరిదాన్ని అంటూ తనకు తానే డిసైడ్ అవుతుంది అపర్ణ. ఎవ్వరి మాట వినదు. రాజ్ తో కూడా మాట్లాడదు. ఇక కావ్య సర్దిచెబుదామని వచ్చినా కూడా కావ్యను కూడా బయటికి పంపించేస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటే తాను వండుకున్నదే తింటుంది అపర్ణ. తన చేష్టలు చూసి అందరికీ చిరాకు వేస్తుంది.

Advertisement

Brahmamudi 18 Sep Monday Episode : ఇందిరా దేవి ఆస్తులు పంచేస్తుందా?

మరోవైపు ఇందిరా దేవి ఆస్తులు పంచేందుకు రెడీ అవుతుంది. ఎందుకంటే.. అపర్ణ తనకు తానే ఎప్పుడూ లేనట్టుగా దుగ్గిరాల ఫ్యామిలీలో చిచ్చురేపింది. తనకు తానే వండుకొని తినడం స్టార్ట్ చేసింది. ఇదంతా కావ్య తప్పు కాదు.. కావాలని రుద్రాణి ఆడిస్తున్నా నాటకం అని అపర్ణ తెలుసుకోలేకపోయింది. రుద్రాణి ట్రాప్ లో పడింది. మరి నువ్వు ఇలా ఒక్కదానివే వండుకొని తినడం, ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం ఏంటి. ఆస్తులు కూడా పంచుకొని ఎవరి దారి వాళ్లు చూసుకోండి. అందరూ వేరు కాపురాలు పెట్టండి అని ఇందిరా దేవి కోప్పడుతుంది.

అయినా కూడా అపర్ణలో మార్పు రాదు. ఇంకా కావ్య మీదనే చిరాకు పడుతుంది. కావ్య వల్లనే దుగ్గిరాల ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని, కావ్య ఇంటి వాళ్లను అందరినీ తన వైపునకు తిప్పుకున్నదని.. కావ్య చెప్పడం వల్లనే ఇందిరా దేవి కూడా వేరు కాపురాలు పెట్టాలని అందరికీ చెప్పిందని కావ్యపై మరోసారి విరుచుకుపడుతుంది అపర్ణ.

మరోవైపు కళ్యాణ్.. అనామికకు తన లవ్ మ్యాటర్ చెప్పాలని డిసైడ్ అవుతాడు. ఇప్పటికే కావ్య కూడా కళ్యాణ్ కు సపోర్ట్ ఇస్తుంది. నీ మనసులో మాట చెప్పేసేయ్ అని ధైర్యం చెబుతుంది. అప్పు కూడా అదే చెబుతుంది. కానీ.. ఎందుకో కళ్యాణ్ మాత్రం అనామికకు ఆ విషయం చెప్పడంలో చాలా మొహమాట పడతాడు.

ఇక.. ఇందిరా దేవి ఇంట్లో ఉన్న వాళ్లందరికీ సమానంగా ఆస్తిలో వాటా పంచేందుకు సిద్ధం అవుతుంది. రాజ్ తోనూ ఇందిరా దేవి మాట్లాడుతుంది. ఆస్తి పంపకాల గురించి చెబుతుంది. ఇంట్లో ఇలా అందరూ ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉండటం కంటే.. ఎవరి కాపురాలు వాళ్లు చూసుకుంటే బెటర్ అని ఇందిరా దేవి అంటుంది.

అయితే.. ఇందిరా దేవితో ఇలా ఆస్తిపంపకాలు చేయిస్తోందే కావ్య అని మళ్లీ పొరబడుతుంది అపర్ణ. ఇదంతా కావ్య చేయిస్తుందని అనుకుంటుంది. మళ్లీ కావ్యపై విరుచుకుపడుతుంది. నీవల్లనే ఈ ఫ్యామిలీ ముక్కలు అవుతోందని.. ఇదంతా నీ వల్లే అని అంతకంతకు అనుభవిస్తావని కావ్యపై సీరియస్ అవుతుంది అపర్ణ. కానీ.. ఇందులో కావ్య తప్పేమీ లేదని.. ఇదంతా రుద్రాణి ఆడిస్తున్న నాటకం అని అపర్ణ అస్సలు తెలుసుకోలేకపోతుంది. అలాగే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా.. అపర్ణ మాత్రం ఇంకా రుద్రాణి మాటలనే నమ్ముతూ ఉంటుంది. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Advertisement