Brahmamudi 18 Sep Monday Episode Highlights : రుద్రాణి ప్లాన్ సక్సెస్.. విడిగా కాపురం పెట్టబోతున్న రాజ్, కావ్య.. దుగ్గిరాల ఫ్యామిలీ ముక్కలు

Advertisement

Brahmamudi 18 Sep Monday Episode Highlights : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. మళ్లీ సోమవారం ప్రసారం అవుతుంది. బ్రహ్మముడి సీరియల్ 18 సెప్టెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 204 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దుగ్గిరాల ఫ్యామిలీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అపర్ణ మాత్రం రాజ్, కావ్య విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. చాలా వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు నుంచి దుగ్గిరాల ఫ్యామిలీలో నేను లేను అంటూ అందరికీ చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. మరోవైపు స్వప్నకు ఫోన్ చేస్తే అస్సలు కలవదు. దీంతో కనకానికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక.. రుద్రాణి ఇంకా రెచ్చిపోతుంది. అపర్ణ దగ్గరికి వెళ్లి అగ్ని మీద ఆజ్యం పోస్తుంది. ఈ ఇంట్లో నీ గురించి, నీ పరువు గురించి ఆలోచించే వాళ్లు ఉన్నారంటే అది నేనే అంటుంది రుద్రాణి.

Advertisement
brahmamudi 18 sept monday episode highlights
indira

ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు నాకు చిరాకు వేస్తోంది అంటుంది అపర్ణ. దీంతో వెళ్తాలే కానీ.. అసలు రాజ్ ఇలా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదు. నిన్ను రివర్స్ అలా అంటాడని అనుకోలేదు. కావ్య రాజ్ ను తన వైపునకు తిప్పుకుంటుంది అని అనుకున్నా కానీ.. తన గుప్పిట్లోకే తెచ్చుకుంటుందని నేను ఏనాడూ అనుకోలేదు. పని మనిషి విషయంలోనే మనకు విలువ లేకుండా చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీ మంచి మనసు నాకు తెలుసు. నీకు ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. కానీ.. ఆ కావ్యకు కావాల్సింది అవే. నువ్వు ఇలా నాలుగు గోడల మధ్య ఉండే ఆ కావ్య గెలిచినట్టు విర్రవీగుతుంది. నువ్వు ఆకాశమంత ఎత్తులో ఉండాలి. నేను అదే చూడాలని అనుకుంటున్నా అంటూ అపర్ణను రెచ్చగొట్టి మరీ వెళ్తుంది రుద్రాణి.

Advertisement

Brahmamudi 18 Sep Monday Episode Highlights : అపర్ణతో మాట్లాడుదామనుకున్న కావ్య

కట్ చేస్తే కావ్యకు ఫోన్ చేస్తాడు మూర్తి. అక్కడంతా బాగానే ఉందా.. గొంతేంటి అలా ఉంది అంటాడు. నాన్న ఇక్కడ అంతా బాగానే ఉంది. నేను కాసేపట్లో బయలుదేరుతాను అంటుంది కావ్య. దీంతో రాత్రి వర్షం పడింది కదా. విగ్రహాలు ఆరలేదు. ఇవాళ రావాల్సిన అవసరం లేదు అంటే సరే నాన్న నేను రేపే వస్తా అంటుంది. స్వప్న ఫోన్ తనకు కూడా కలవలేదు అంటుంది. మరోవైపు రాజ్ కూడా అపర్ణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన తల్లితో మాట్లాడాలని అనుకొని తన దగ్గరికి వెళ్తాడు. మమ్మీ అంటే వినదు. చాలు.. జరిగింది చాలు. చెప్పింది చాలు. అన్నది చాలు.. అంటుంది అపర్ణ.

అందరిలో నువ్వు కలిసిపోయావు. అందరితో పాటు నువ్వు నన్ను విమర్శించావు. అందరూ తప్పు పట్టేంత తప్పు నేను ఏం చేశాను. ఇవాళ నీకు తల్లి కనిపించకుండా పోయింది. భార్య మాత్రమే నీకు కనిపిస్తోంది. నువ్వు నీ భార్యతో కలిసిపోతే నేను మాత్రం ఎందుకు వద్దంటాను. ఈ అమ్మ నీకు పరాయిదైపోయింది.. అంటుంది అపర్ణ. నువ్వు నీ భార్యను అర్థం చేసుకున్నావు కదా. హాయిగా కాపురం చేసుకోండి. ఈ ఇంట్లో నిన్ను అడిగే వారు ఎవరు అంటుంది అపర్ణ.

ఆ తర్వాత ఇంట్లో తన వంట తానే చేసుకుంటుంది. ఎవ్వరితో మాట్లాడదు అపర్ణ. అందరూ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తుంటే తను వండుకున్న అన్నాన్ని తీసుకొని పోయి సోఫా మీద కూర్చొని తినడానికి రెడీ అవుతుంది అపర్ణ. ఇదంతా చూసి ఇంటి వాళ్లు అందరూ షాక్ అవుతారు. ఇక్కడ అందరికీ సిద్ధం చేస్తుంటే నువ్వు వెళ్లి అక్కడ కూర్చొని తింటున్నావు అని ఇందిరా దేవి అడుగుతుంది. దీంతో అది నేను వండింది కాదు కదా అత్తయ్య అంటుంది అపర్ణ.

ఈ ఇంట్లో నువ్వు  వండింది.. నేను వండింది అని ఎప్పుడు మొదలైంది అని అడుగుతుంది. దీంతో ఈరోజు నుంచే మొదలైంది. ఇక నా వంట నేనే చేసుకుంటా. నా పనులు నేనే చేసుకుంటాను అంటుంది అపర్ణ. దీంతో విడిపోవాలి అని అనుకున్నప్పుడు వంటింట్లో మాత్రమే ఎందుకు ఇంట్లో కూడా విడిపోవాలి.. ఆస్తులు పంచుకొని ఎవరి కాపురాలు వాళ్లు వేరుగా పెట్టుకోండి అని అంటుంది ఇందిరా దేవి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
Advertisement