Brahmamudi 2 Oct Monday Episode Highlights : గణేష్ వేడుకల్లో మన మనసులోని కోరికను రాజ్ రాసిన చీటీ చూసి కావ్య షాక్.. రాజ్‌కి దూరంగా వెళ్లిపోనున్న కావ్య
Brahmamudi 2 Oct Monday Episode Highlights : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. బ్రహ్మముడి సీరియల్ 2 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 216 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వప్న జాడ తెలియగానే వెంటనే కారులో బయలుదేరుతారు రాజ్, కావ్య. మరోవైపు రాహుల్ ఆసుపత్రిలో ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. స్వప్న లేకుండా నేను బతకలేను.. అంటూ డాక్టర్ ముందు ఓవర్ యాక్షన్ చేస్తాడు. జీవితాంతం వాళ్లు స్వప్న కోసం వెతుకుతూనే ఉండాలి అంటూ రుద్రాణిని చూసి నవ్వుతాడు రాహుల్. మరోవైపు కనకం.. మైఖేల్, స్వప్నతో ఏవేవో పూజలు చేయిస్తూ ఉంటుంది. ఏంటి ముసలి నువ్వు నాతో ఇన్ని పూజలు చేయిస్తున్నావు. ఇంకెప్పుడు తాళి కట్టిస్తావు అంటాడు మైఖేల్. దీంతో నీ వయసు ఎంత అంటే 27 అంటాడు. ఎంత నొక్కేశావు అంటుంది. దీంతో 10 అంటాడు. అంటే 37 ఏళ్లా.. పిల్ల చూస్తే 25 ఏళ్లు కూడా లేదు. శాస్త్రం ఒప్పుకోదు అంటుంది. దీంతో ఏం చేయాలి అంటే.. నీకు ముదురు బెండకాయతో పెళ్లి జరిపించాలి ముందు అంటుంది కనకం. ఎలాగోలా పెళ్లి త్వరగా కాకుండా ఆపగలుగుతూ ఉంటుంది కనకం. వాళ్లు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది.
ఇంతలో రౌడీలు బెండకాయ తీసుకొస్తారు. బెండకాయకు తాళి కడతాడు మైఖేల్. బెండకాయతో పెళ్లి అయిపోయాక ఇక అస్సలు ఆగడు. వెంటనే స్వప్నకు తాళి కట్టేస్తాను అంటాడు మైఖేల్. తాళి కట్టబోతుండగా ఆపు అంటుంది కనకం. ఏంటి ముసలి.. ఈ పెళ్లి ఎవ్వరూ ఆపలేరు అంటాడు మైఖేల్. దీంతో ఈ పెళ్లి ఎవ్వరూ ఆపలేరు అంటాడు. దీంతో ఆపుతారురా.. అటుచూడు నా కూతురు, అల్లుడు వచ్చారు అంటుంది కనకం. వాళ్లను చూసి షాక్ అవుతాడు మైఖేల్. రాజ్ ను చూసి మైఖేల్ కు ఏం చేయాలో అర్థం కాదు. నన్ను కొట్టకండి సార్. అసలే నాకు వాతం, కీళ్లనొప్పులు అంటాడు. ఇంతలో పోలీసులు కూడా వస్తారు. అసలు నాకు ఒక డౌట్.. ఎవ్వరికీ తెలియకుండా పక్కాగా ప్లాన్ చేశాను కదా. ఎలా తెలిసింది అని అడుగుతాడు మైఖేల్. దీంతో ఇలా అంటుంది కనకం. దీంతో రౌడీలు అందరూ బిత్తిరిపోతారు.
Brahmamudi 2 Oct Monday Episode Highlights : రాహుల్ ఓవర్ యాక్షన్ కు పుల్ స్టాప్
మరోవైపు రాహుల్ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. ఇక.. ఇంటికి వచ్చాక రాహుల్, రుద్రాణి ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. రాహుల్ ముందు ఈ జ్యూస్ తాగు అంటుంది రుద్రాణి. వద్దు అంటాడు. స్వప్న దూరం అవడం బాధాకరమే కానీ.. నువ్వు ఇలా ఏం తినకుండా, తాగకుండా ఉంటే ఎలా అంటుంది. ఎలా తాగమంటావు మమ్మీ. నేను చేతగానివాడిలా స్వప్నను తీసుకెళ్తుంటే చూస్తూ నిలబడ్డాను అంటాడు రాహుల్. అంతా నీ కేర్ లెస్ నెస్ వల్లనే ఇదంతా జరిగింది అంటాడు సుభాష్.
స్వప్న దూరం అయ్యాకే నేను ఏం కోల్పోయానో నాకు అర్థం అవుతోంది అంటాడు రాహుల్. తనతో గడిపిన వారం రోజులు నాకు ఎంతో విలువైనవి అంటాడు రాహుల్. ఇప్పుడు ఆ మనిషి లేదు. దూరం అయిపోయింది అంటాడు రాహుల్. ఇంతలో కావ్య, రాజ్ ఇద్దరూ వచ్చి దూరం అవ్వలేదు అంటారు. స్వప్న ఇంట్లోకి వస్తుంది. స్వప్నను చూసి రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు.
రాహుల్ నువ్వు బాగానే ఉన్నావా అంటూ రాహుల్ దగ్గరికి వెళ్తుంది స్వప్న. వాళ్లు నిన్ను ఏం చేయలేదు కదా. అంతా బాగానే ఉన్నావు కదా అంటే అవును అంటుంది స్వప్న. అసలు ఏం జరిగింది. స్వప్నను ఎవరు తీసుకెళ్లారో తెలిసిందా అంటే తెలిసింది తాతయ్య అంటాడు రాజ్. అప్పుడు స్వప్న పెళ్లిలో వెయిటర్ గా వచ్చి స్వప్నను ఎత్తుకెళ్లిన వాడే మళ్లీ ఎత్తుకెళ్లాడు అంటాడు రాజ్. పెళ్లి చేసుకోవడానికి ఎత్తుకెళ్లాడు అంటాడు. అప్పుడు స్వప్నను ఎత్తుకెళ్లినప్పుడు కుదర్లేదని.. స్వప్న ఎప్పుడు దొరుకుతుందో చూసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సమయానికి వీళ్ల అమ్మకు ఆ విషయం తెలిసి కాపాడాం అంటాడు రాజ్. చంపేయ్ రా అంటే పెళ్లి చేసుకుంటావా అంటూ రాహుల్ .. మైఖేల్ మీద సీరియస్ అవుతాడు.
కట్ చేస్తే దుగ్గిరాల ఇంట్లో గణేష్ ఉత్సవాలు జోరుగా సాగుతుంటాయి. గణేష్ మహరాజ్ కి జై అంటూ గణేష్ ను ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. మన మనసులో ఉన్న కోరికలను ఒక చీటీలో రాసి వాటన్నింటినీ వినాయకుడి దగ్గర పెట్టుకోవాలి. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని ఇందిరా దేవి చెప్పడంతో అందరూ తమ మనసులోని కోరికలను రాయడంలో బిజీ అవుతారు.
తాతయ్యకు ఇచ్చిన మాట కోసమే నేను కళావతితో మంచిగా నటిస్తున్నా. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ నాటకాన్ని ముగించు.. అంటూ రాజ్ చీటీలో రాస్తాడు. ఆయన మనసుకి నొప్పి కలగకుండా ఆయన ఏం కోరుకుంటున్నారో అది నెరవేరేలా చూడు స్వామి అంటూ కావ్య చీటీ రాస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.