Brahmamudi 20 Sep Today Episode : మూర్తిని కొట్టిపడేసిన రాహుల్ మనుషులు.. వినాయక విగ్రహాలన్నీ మాయం.. కావ్యకు ఈ విషయం తెలిసి షాక్

Advertisement

Brahmamudi 20 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 సెప్టెంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 205 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దుగ్గిరాల ఫ్యామిలీకి దూరం అయ్యేది మీరే. నా భర్త నాకే దగ్గర అవుతున్నారు. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోండి అని కావ్య.. అపర్ణతో చెబుతుంది. మీరు ఏదైతే మనసులో ఊహించుకుంటున్నారో అదే జరుగుతోంది. ఆ అవకాశాన్ని మరే నాకు ఇస్తున్నారు. ఇక ముందు మీ స్థానంలో మీరు ఉంటాలంటే ఇంటికి, ఇంటి సభ్యులకు దూరం అయి మీరు సాధించేది ఏం లేదు. కాదు.. మీ నిర్ణయమే సరైనది అనుకుంటే మొత్తం ఇంటి బాధ్యతను నాకు అప్పగిస్తారు. ఇకపై మీరే ఆలోచించుకోండి అత్తయ్య మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య. దీంతో అపర్ణకు ఏం చేయాలో అర్థం కాదు. కావ్య చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement
brahmamudi 20 sept 2023 wednesday full episode
ganesh

మరోవైపు రుద్రాణి మందు తాగుతూ కూర్చుంటుంది. కావ్య.. నామీదే పొగరు చూపిస్తావా? ఇప్పుడు మీ అత్తయ్య నీ మీద యుద్ధం ప్రకటించేలా చేశాను. ఇప్పుడేం చేస్తావు అంటూ అనుకుంటుంది. నేను నా మొగుడికి దూరంగా ఉన్నాను అంటావా? ఇప్పుడు మీ అత్త చేతే నీ మొగుడికి దూరం అయ్యేలా చేస్తాను చచూడు అని అనుకుంటుంది. కట్ చేస్తే తెల్లవారుతుంది. కావ్య ఇంటి పని చేస్తూ ఉంటుంది. అందరూ అక్కడే కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడికి అపర్ణ వస్తుంది. అక్కడ కూర్చుంటుంది. కావ్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని కావ్య.. అంటూ గట్టిగా అరుస్తుంది. అందరూ షాక్ అవుతారు. వెంటనే అక్కడికి వెళ్తుంది కావ్య. చెప్పండి అత్తయ్య గారు అంటుంది.

Advertisement

రోజూ చేసే పనులు కూడా నీకు గుర్తు చేయాలా? చెప్పకుండా చేయలేవా? లేకపోతే నిన్ను అందరూ అడుక్కోవాలి అనుకుంటున్నావా? ఇంత పొద్దుపోయింది.. ఒక్కరికైనా కాఫీ ఇచ్చావా అని అడుగుతుంది అపర్ణ. దీంతో మా అందరికీ ఎప్పుడో ఇచ్చేసింది. ఇందాక నీకు కూడా తీసుకొచ్చింది. కానీ.. నువ్వు రాలేదని మళ్లీ తీసుకెళ్లింది అని సుభాష్ అంటాడు. అంటే.. మేము వచ్చి అడుక్కోవాలా కాఫీ కోసం అంటుంది అపర్ణ. దీంతో ఇప్పుడే తీసుకొస్తా అంటూ కావ్య వెళ్లగానే.. రుద్రాణి వెళ్లి ఏంటి వదిన ఇది అప్పుడే క్షమించేశావా అంటూ అడుగుతుంది రుద్రాణి. దీంతో అందరూ రుద్రాణిని తిడుతారు. నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు. నీ కోడలు తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత నీకు లేదా? ఆ తప్పుకు శిక్ష వేసే అధికారం నీకు లేదా? ఏం లేదని నువ్వు ఇలా వెనకడుగు వేస్తున్నావు.. అంటుంది రుద్రాణి.

Brahmamudi 20 Sep Today Episode : కావ్యతో అపర్ణ మాట్లాడటం చూసి రుద్రాణి షాక్

ఇంతలో కావ్య కాఫీ తెచ్చి ఇస్తుంది. నీ ఇష్టాలు అన్నీ నా ఇష్టాలు అని చెప్పి మా అత్తయ్యను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు అని కావ్య.. రుద్రాణిపై సీరియస్ అవుతుంది. ఏం టిఫిన్ చేశావు అంటే.. రవ్వ ఉప్మా అంటుంది కావ్య. దీంతో ఎవరిని అడిగి చేశావు. నాకు దోశ తినాలని ఉంది. నాకు దోశ చేయి.. అనగానే కావ్య సంతోషంతో అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్తుంది. రుద్రాణికి అసలు ఏం చేయాలో అర్థం కాదు.

ఆ తర్వాత రాజ్ ను చూసి కూడా మాట్లాడుతుంది అపర్ణ. నువ్వు నాతో మాట్లాడుతున్నవా? నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు రాజ్. దీంతో నువ్వు ఎక్కడ తప్పులు చేస్తావని కోపం చూపిస్తాను తప్పితే నీతో మాట్లాడకుండా ఉండలేను అంటుంది అపర్ణ. మమ్మి నాతో మాట్లాడింది అంటూ ఇంట్లోకి వెళ్లి సంతోషంగా ఉంటాడు రాజ్. దీంతో ఇదంతా కావ్య చేసిందని చెబుతారు ఇంట్లో వాళ్లు.

మా మమ్మీ నాతో మాట్లాడింది అని కావ్యను ఎత్తుకుంటాడు రాజ్. దీంతో అత్తయ్య నాతో కూడా మాట్లాడింది అంటుంది కావ్య. మరోవైపు ఈరోజు మీ ఆశీర్వాదం కావాలి తాతయ్య గారు అంటుంది కావ్య. దీంతో ఇది పూర్తయితే మా నాన్న అప్పులు తీరిపోతాయి. ఇల్లు మా వాళ్ల సొంతం అవుతుంది అంటుంది కావ్య.

కావ్య ఆ కాంట్రాక్ట్ పూర్తి చేసి అప్పులు తీర్చాలని అనుకుంటోందని, అది జరగకూడదని వెంటనే రాహుల్ కు ఫోన్ చేసి చెబుతుంది రుద్రాణి. దీంతో వాళ్లు తయారు చేసిన విగ్రహాలన్నీ ఈరోజు రాత్రికే మాయం చేస్తా అంటాడు రాహుల్. రాత్రికి కొందరిని పంపించి విగ్రహాలన్నీ ఎత్తుకెళ్లమని చెబుతాడు రాహుల్. వాళ్లు వెళ్లి మూర్తిని కొట్టి పడేసి విగ్రహాలను ఎత్తుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
Advertisement