Brahmamudi Today Episode : అపర్ణతో బర్త్‌డే కేక్ కట్ చేయించిన రాజ్.. మరదలు యామినికి రామ్ షాక్ మీద షాక్
ప్రధానాంశాలు:
Brahmamudi Today Episode : అపర్ణతో బర్త్‌డే కేక్ కట్ చేయించిన రాజ్.. మరదలు యామినికి రామ్ షాక్ మీద షాక్
Brahmamudi Today Episode : బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గుడిలో రాజ్, కావ్యను చూసి దంపతులిద్దరు సీతారాముళ్లా చూడముచ్చటగా ఉన్నారు అని పంతులు అంటాడు. పూజారి గారు మేమిద్దిరం భార్యాభర్తలం కాదు. కానీ, ఈవిడ నాకు చాలా బాగా తెలిసినావిడ. చాలా మంచిది అని రాజ్ అంటాడు. కావ్యకు పూజారి, రాజ్ ఇద్దరు క్షమాపణ చెబుతారు. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు అని పూజారి అడిగితే.. మా అమ్మ పేరు మీద. ఇవాళ ఆమె పుట్టినరోజు అని రాజ్ అంటాడు. మీ అమ్మగారి పేరు అని పూజారి అడిగితే. భానుమతి అని రామ్ అంటాడు. దాంతో అపర్ణ, కావ్య కాస్త నిరాశపడతారు.

Brahmamudi Today Episode : అపర్ణతో బర్త్‌డే కేక్ కట్ చేయించిన రాజ్.. మరదలు యామినికి రామ్ షాక్ మీద షాక్
తర్వాత అన్నదానం మొదలుపెడదామని రాజ్, కావ్య వెళ్తారు. మరోవైపు రాజ్ ఎక్కడికి వెళ్లాడో జీపీఎస్ ద్వారా చూసిన యామిని టెన్షన్ పడుతుంది. బావ శివాలయంకు వెళ్లింది నిజమే. కానీ, వెళ్లి గంట అయింది. ఇంకా ఎందుకు రాలేదు అని యామిని అంటుంది. ఆయన భక్తి పారవశ్యంలో మునిగిపోయారేమో అని వైదేహి అంటుంది. అక్కడ ఎవరైనా కలిసి ఉండాలి. లేదా ఎవరినైనా కలిసి ఉండాలి, ఏది జరిగినా మనకే ప్రమాదం అని యామిని అంటుంది. నువ్వు ఒకసారి గుడికి వెళ్లడమే మంచిదనిపిస్తుంది అని వైదేహి అంటుంది. నీ చేయి దాటకుండా చూసుకో అనగానే యామిని గుడికి బయల్దేరుతుంది. మరోవైపు అందరికి అన్నదానం చేస్తుంటాడు రాజ్. నా కొడుకు చేస్తున్న అన్నదానానికి నేను దూరంగా ఉండటం ఏంటీ అని బంతిలో వెళ్లి కూర్చుంటుంది అపర్ణ.
అది చూసి కావ్య షాక్ అవుతుంది. అపర్ణ కూర్చోవడం చూసిన రాజ్ వెళ్లి ప్లేట్ తీసుకెళ్తాడు. మీరు ఆకలితో ఎదురుచూసే మనిషిలా కనిపించట్లేదు. మీరే పదిమందికి అన్నం పెట్టేవారిలా కనిపిస్తున్నారు. కానీ, మీరు ఇలా వచ్చి కూర్చోవడం చాలా ఆశ్చర్యంగా, చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇక్కడ అన్నదానం చేసేసరికి ఎందుకో తినాలనిపించింది. అందుకే ఇలా వచ్చాను అని అపర్ణ అంటుంది. ఎందుకలా అని రాజ్ అడుగుతాడు. ఈరోజు నా పుట్టినరోజు కూడా అని అపర్ణ చెప్పడంతో హ్యాపీ బర్త్ డే అమ్మా అని రాజ్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. దాంతో మరింత సంబరపడిపోతుంది అపర్ణ.
అపర్ణకు భోజనం వడ్డిస్తాడు రాజ్. మీ కొడుకు గురించి ఆలోచిస్తూ సగం సగం తినకండి. నన్ను కూడా మీ కొడుకు అని సంతోషంగా తినండి అని రాజ్ అంటాడు. అలాగే అని అపర్ణ అంటుంది. రామ్ గారు మీ అమ్మ పేరు మీద అన్నదానం చేయాలన్న కోరిక తీరిందా అని కావ్య అడిగితే.. సగం తీరింది. ఇంకా ఉంది అని రాజ్ అంటాడు. మీరు ఇంకో చిన్న సహాయం చేయాలని అంటే చెప్పండి అంటుంది కావ్య. ఇవాళ ఆవిడ(అపర్ణ) పుట్టినరోజు అట. వాళ్ల కొడుకు ఆవిడ పేరు మీద అన్నదానం చేయించేవాడట. ఈ సంవత్సరం లేడని చాలా బాధపడుతున్నారు. అతని స్థానంలో మనం ఉండి పుట్టినరోజు సందర్భంగా ఒక కేక్ కట్ చేయిస్తే బాగుంటుందండి అని రామ్ అంటాడు. దాంతో కావ్య మీరు అన్నదానం పూర్తి చేయండి. నేను కేక్ తెప్పిస్తాను అని వెళ్లిపోతుంది.
Brahmamudi Today Episode అపర్ణతో బర్త్‌డే కేక్ కట్ చేయించిన రాజ్
అపర్ణ దగ్గరికి వెళ్లి అమ్మ పేరు మీద అన్నదానం చేయించాను. అలాగే కేక్ కట్ చేయించాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా అమ్మగా అనుకోవచ్చా అని రాజ్ అడుగుతాడు. అలాగే మీరు కూడా నన్ను మీ కొడుకే అనుకోండి. మీరు కాదనరనే నమ్మకంతో కేక్ కూడా తెప్పించాను. వచ్చి కేక్ కట్ చేస్తారా ప్లీజ్ అని రాజ్ అంటాడు. అపర్ణ కేక్ కటింగ్‌కు ఒప్పుకుంటుంది. తర్వాత అపర్ణతో కేక్ కట్ చేయించి బర్త్ డే చేస్తాడు రాజ్. అది చూసి యామిని షాక్ అవుతుంది. రామ్ దగ్గరికి వెళ్లిన యామిని బావ ఇంతకీ ఈవిడ ఎవరు అని అడుగుతుంది. అపర్ణ భుజాలపై చేయి వేసి అమ్మా అని మరదలికి పరిచయం చేస్తాడు రామ్. దాంతో యామిని మరింత షాక్ అవుతుంది. అపర్ణ, కావ్యతో రాజ్ ఉండటం, అపర్ణను అమ్మా అని రాజ్ చెప్పడంతో యామినికి షాక్ మీద షాక్ తగులుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.