
#image_title
Brahmamudi 26 Sep Tuesday Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 26 సెప్టెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 211 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైఖేల్ స్వప్నను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే కదా. రాహుల్ ను కొట్టి మరీ స్వప్నను మైఖేల్ కిడ్నాప్ చేస్తాడు. అంతే కాదు.. స్వప్నను మైఖేల్ బతకనీయడు.. చంపేస్తాడు అని నాటకం ఆడుతాడు. దుగ్గిరాల ఫ్యామిలీని నమ్మించే ప్రయత్నం చేస్తాడు రాహుల్. మరోవైపు బొద్దింకను చూసి భయపడ్డ రాజ్ ను చూసి మీరు నిజంగానే రౌడీలతో ఫైట్ చేశారా అని అడుగుతుంది కావ్య. దీంతో రాజ్ కు కోపం వస్తుంది. అవునా.. నాకు భయం లేదు అని నిరూపించడానికి ఏం చేయమంటావు. నువ్వు ఏ పరీక్ష అయినా పెట్టుకో అని కావ్యతో రాజ్ చాలెంజ్ చేస్తాడు. దీంతో కావ్య తన చేతులతో ఎత్తుకోవాలని అడుగుతుంది. కనీసం ఒక 10 నిమిషాలు అయినా ఎత్తుకోవాలని అడుగుతుంది. దీంతో తన సత్తా చూపించేందుకు కావ్యను పది నిమిషాలు ఎత్తుకుంటాడు రాజ్. దీంతో ఓకే ఓకే నువ్వు రౌడీలను కొట్టావు అని ఒప్పుకుంటాను అంటుంది కావ్య. ఆ తర్వాత ఆమెను కిందికి దించుతాడు. రాజ్ తనను ఇష్టపడుతున్నాడు అని మనసులో అనుకొని మురిసిపోతుంది కావ్య. తనను ఇష్టపడుతున్నా కూడా తన ఈగో వల్ల బయటకి చెప్పలేకపోతున్నాడని అనుకుంటుంది కావ్య.
#image_title
మరోవైపు అప్పును కళ్యాణ్ అస్సలు కలవడు. ఇలా రెండు మూడు సార్లు చేసేసరికి అప్పుకు చాలా కోపం వస్తుంది. కళ్యాణ్ కు ఎన్నిసార్లు చేసినా ఫోన్ బిజీ రావడంతో కళ్యాణ్ మీద అప్పుకు కోపం పెరుగుతుంది. మరోవైపు ఉదయం లేవగానే స్కిప్పింగ్ చేస్తుంటాడు రాజ్. రాత్రి నన్ను మోసినప్పుడు మీరు చాలా ఆయాసపడ్డారు. దాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు మొదలుపెట్టారు కదా అని రాజ్ ను అడుగుతుంది కావ్య. దీంతో స్కిప్పింగ్ లో ఆగకుండా 100 చేశా. నువ్వు కనీసం 20 కూడా చేయగలవా అని అడుగుతాడు రాజ్. దీంతో స్కిప్పింగ్ లో నన్ను ఎవ్వరూ ఓడించలేరు తెలుసా అని అంటుంది కావ్య. దీంతో నాతోనే పోటీ పడాలని అనుకుంటున్నావా అంటాడు రాజ్. దీంతో రెడీనా అంటుంది కావ్య. ఇద్దరూ కలిసి స్కిప్పింగ్ ఆడుతుంటే బయటికి వచ్చిన అపర్ణ చూసి షాక్ అవుతుంది. రుద్రాణి చూసి కాంట్రాక్ట్ పూర్తయిందని తెగ సంతోషపడుత మొగుడితో గంతులేస్తోంది. ఒక్కసారి స్వప్న కనిపించడం లేదని తెలియనీయ్.. అప్పుడు ఎలా గెంటుతుందో నేనూ చూస్తాను అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. కానీ.. కావ్యతో స్కిప్పింగ్ లో పోటీ పడలేకపోతాడు రాజ్.
కావ్య ముందు ఓడిపోయినా కూడా తను ఓడిపోయాడని అనదు. నేను గెలిచాను అంటుంది. భర్తకు విలువ ఇవ్వడం చూసి సీతారామయ్య, ఇందిరాదేవి సంబరపడతారు. నీతో పోటీపడి మళ్లీ గెలుస్తా అంటూ కావ్యపై చాలెంజ్ విసురుతాడు రాజ్. మరోవైపు కళ్యాణ్ పై కోపంతో రగిలిపోతున్న అప్పు.. కళ్యాణ్ కనిపించగానే కర్రతో కొడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు కళ్యాణ్ కు. అనామికతో పెళ్లి విషయం చెప్పడానికి వచ్చిన కళ్యాణ్.. అప్పు కోపం చూసి తన కోపం తగ్గించడం కోసం ఐలవ్యూ అంటాడు. దీంతో అప్పు వెంటనే అతడిని కొట్టడం ఆపేస్తుంది. ఈ మాట చెబుతుందనే.. నేను అనామికను కలవడానికి వెళ్లాను. కానీ.. అనామిక మాత్రం ఏకంగా పెళ్లి కార్డునే నా ముందు పెట్టింది అంటాడు. మరి నన్ను కలవడానికి నువ్వు ఎందుకు రాలేదు. అనామికను నువ్వు కలిస్తే నాకేంటి అంటూ అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది అప్పు.
నా అప్పు ఎప్పుడు తీర్చుతారు అని చంపక్ లాల్.. మూర్తి ఇంటికి వెళ్లి గొడవ చేస్తాడు. దీంతో కనకానికి కోపం వస్తుంది. మీ ఇంటి పరువును గంగపాలు చేస్తా అని బెదిరిస్తాడు. మా పరువును నువ్వేం చేస్తావు.. నీ రక్తాన్ని గంగా నదిలో కలుపుతా అంటూ సేట్ పై విరుచుకుపడుతుంది కనకం. దీంతో రెండు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోత మీ అంతు చూస్తా అని చెప్పి సేటు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక.. స్వప్నను ఓ ప్లేస్ కు తీసుకొచ్చిన రాహుల్.. తనకు ఒక రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు. అంతలోనే అక్కడికి మైఖేల్ వచ్చి.. స్వప్నపై గన్ గురిపెట్టి రాహుల్ ను కొట్టి స్వప్నను కిడ్నాప్ చేస్తాడు. రాహుల్ ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. స్వప్నను కిడ్నాప్ చేశారని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని కపట నాటకం ఆడుతాడు రాహుల్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
This website uses cookies.