Sreeleela : శ్రీ లీల గురించి నమ్మలేని బిగ్ బ్రేకింగ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreeleela : శ్రీ లీల గురించి నమ్మలేని బిగ్ బ్రేకింగ్ న్యూస్ !

Sreeleela  : పెళ్లి సందడి ‘ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల Sreeleela అది తక్కువ టైంలోనే పాపులర్ అయింది. ఇటీవలే మాస్ మహారాజా రవితేజ కు జోడిగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో శ్రీ లీల పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం శ్రీ లీల వరుసగా ఆరు, ఏడు సినిమాలను చేస్తుంది. అందులో ఒకటి నటసింహం బాలయ్య సినిమాలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 May 2023,6:00 pm

Sreeleela  : పెళ్లి సందడి ‘ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల Sreeleela అది తక్కువ టైంలోనే పాపులర్ అయింది. ఇటీవలే మాస్ మహారాజా రవితేజ కు జోడిగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో శ్రీ లీల పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం శ్రీ లీల వరుసగా ఆరు, ఏడు సినిమాలను చేస్తుంది. అందులో ఒకటి నటసింహం బాలయ్య సినిమాలో కనిపించబోతుందట. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణకు కూతురిగా కనిపించడం లేదట.

బాలయ్య Balakrishna బాబు స్నేహితుడు శరత్ కుమార్ కూతురిగా శ్రీ లీల ఈ సినిమాలో కనిపించనుందట. అయితే బాలకృష్ణ శ్రీలీల పట్ల అభిమానంతో స్నేహితుడి కూతురును తన కూతురిగా ప్రేమగా చూసుకుంటాడట. అయితే ఈ సినిమాలో ఓ ట్విస్ట్ ఉందని సమాచారం. బాలయ్య బాబు శ్రీలీల బంధానికి కథకు కీలకమైన లింకు ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుంది. ఇక బాలయ్య ఎన్నడూ లేని విధంగా ఫ్రెష్ అండ్ యంగ్ లుక్ లో కనిపిస్తాడు. అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసను మాట్లాడనున్నట్లుగా సమాచారం.

Sreeleela

Sreeleela

ఈ సినిమాను హరీష్ పెద్ది సాహూ గారపాటి నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ 108వ సినిమా కావడంతో ఎన్బికె 108 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ ఏడాది అక్టోబర్ 19 న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఎన్బికె 108 సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరీ ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యను ఏ విధంగా చూపిస్తాడో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది