Samantha : అసలే హెల్త్ బాలేక డైలీ ఏడుస్తోన్న సమంతకి కొంప మునిగే బ్రేకింగ్ న్యూస్ !
Samantha : హీరోయిన్ సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా వివిధ భాషలలో కూడా సినిమాలను చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది. సౌత్ లో నయనతార తర్వాత మంచి పాపులారిటీని సంపాదించుకుంది సమంత. అటు బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ లను చేస్తూ మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇటీవల అక్కడ కూడా వరుస సినిమాలకు సైన్ చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సామ్ హాలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
ప్రస్తుతం సమంత నటించిన తెలుగు పాన్ ఇండియా సినిమా యశోద థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మొదటి రెండు వారాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత కలెక్షన్ల పరంగా పెద్దగా రాబట్ట లేకపోతుందని చెప్పవచ్చు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందిన ఈ సినిమాని కొత్త డైరెక్టర్ హరి హరీష్ దర్శకత్వం వహించగా, కృష్ణ లంక ప్రసాద్ నిర్మించారు. అయితే త్వరలోనే ఈ సినిమా రెండు మూడు భాగాలు రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కలెక్షన్ల పరంగా చాలా డల్ గా ఉందనే చెప్పాలి.
మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరదని సమాచారం.పరోపక్క డిసెంబర్ రెండవ వారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఓటిటిలో ప్రసారం కాబోతుందని వెల్లడించారు. కానీ ఈ సినిమాలో చూపించిన ఎవా హాస్పిటల్ పేరును తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని ఈ సినిమా ఓటిటి రిలీజ్ అవ్వడానికి ఆపేందుకు కోర్టులో ఫైల్ వేసారు యాజమాన్యం. దీంతో సమంతకి కొత్త సినిమా వలన కష్టాలు వచ్చాయని తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందో లేదో, చిత్ర బృందం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.