Bullet Bhaskar : షోలో బుల్లెట్ భాస్కర్ తండ్రికి ప్రమాదం.. ఒక్కసారి జారి పడటంతో అలా

 Authored By prabhas | The Telugu News | Updated on :21 June 2022,1:00 pm

బుల్లితెరపై టీఆర్పీ కోసం వేసే స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక వీటిల్లో ఇప్పుడు ప్రోమోను కాంట్రవర్సీ చేయడమే ప్రథమంగా పెట్టుకున్నారు. ప్రోమోలో ఏదో ఒక గొడవ పెట్టుకోవడం, తిట్టుకోవడం, షో నుంచివెళ్లిపోతోన్నట్టు బిల్డప్ ఇవ్వడం, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినట్టు చూపించడం వంటివి చేసుకుంటూ వెళ్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. తాజాగా వదిలిన ప్రోమోలోనూ ఇలాంటి ఓ స్టంటే వాడేశారు. ఇంతకీ ఆ ప్రోమోలో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. పెళ్లాం చెబితే వినాలి అనే థీమ్‌తో వచ్చే ఆదివారం శ్రీదేవీ డ్రామా కంపెనీ రెడీ అయింది.

ఇందులో భార్యాబాదితల సంఘం అంటూ ఆది,రాం ప్రసాద్ ఇలా అందరూ వచ్చారు. ఇక నటి శ్రీవాణి భర్త విక్రమ్ సందడి మామూలుగా లేదు. ఈ ఇద్దరి జోడి ఎప్పుడూ నవ్వులూ పూయిస్తూనే ఉంటుంది. ఈసారి మాత్రం శాంతికుమార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ షోకు దూరంగా ఉన్న శాంతి కుమార్ ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీకి వచ్చేశాడు. ఆయన తన భార్యతో కలిసి అద్భుతంగా పాట పాడేశాడు. అయితే ఇందులో ఆడవాళ్లు, మగవాళ్లంతా టీంలుగా విడిపోయి ఆటలు ఆడారు. బిగ్ బాస్ కౌశల్ కూడా ఏదో పొడిచేసే వాడిలా ముందుకు వెళ్లాడు.

Bullet Bhaskar Father Fall down in Sridevi Drama Company

Bullet Bhaskar Father Fall down in Sridevi Drama Company

తాడు లాగలేక చతికిలపడ్డాడు. ఇక తన భార్యతో కలిసి ఓ రొమాంటిక్ పర్ఫామెన్స్ ఇచ్చాడు కౌశల్. ఇదంతా బాగానే ఉంది. అయితే కబడ్డీ ఆటే కాస్త గందరగోళానికి దారి తీసింది. కబడ్డీ ఆటలో ముందుగా విక్రమ్, శ్రీవాణి వచ్చారు. టిఫిన్ బాక్స్ చూపించడంతో లొట్టలేసుకుంటూ విక్రమ్ శ్రీవాణి వద్దకు వచ్చేశాడు. అలా అవుట్ అయిపోయాడు. అయితే బుల్లెట్ భాస్కర్ తండ్రి ఏదో చేసేద్దామని వచ్చాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ కూత పెడుతూ అలానే పడిపోయాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే అక్కడేమీ జరిగి ఉండదనీ, కావాలనే ప్రోమో కోసం ఇలాంటివి చేసి ఉంటారని నెటిజన్లు లైట్ తీసుకుంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి