Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మీద బుల్లెట్ భాస్కర్ కౌంటర్.. అలా చేసి చేసి వెళ్లిపోయాడట
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పేరు వింటే జబర్దస్త్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సుడిగాలి సుధీర్ అనే పేరుని ఇచ్చింది జబర్దస్త్. అక్కడి నుంచి సుధీర్ కెరీర్ స్టార్ట్ అయింది. తొమ్మిదేళ్లుగా అక్కడే ఉన్నాడు. జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సార్లు కంటతడి పెట్టుకున్నాడు. మల్లెమాలకు విధేయుడిగా ఉన్నాడు. మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా వెళ్లలేదు. నాగబాబు పిలిచినా కూడా వెళ్లకుండా ఉన్నాడు. బాండ్, అగ్రిమెంట్లు అంటూ సుధీర్ మల్లెమాలలోనే ఉండిపోయాడు.. అందుకే వెళ్లలేకపోయాడంటూ గాసిప్స్ వచ్చాయి.మొత్తానికి ఇప్పుడు సుధీర్ ఈటీవీకి దూరంగా వెళ్లాడు. మల్లెమాల నుంచి అగ్రిమెంట్లను తెంచేసుకున్నాడు. తనకు ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్చగా తిరిగేస్తున్నాడు. స్టార్ మాలో హోస్టింగ్ చేస్తున్నాడు. సింగింగ్ షోకు హోస్ట్‌గా ఉన్నాడు..
అనసూయ, సుధీర్ కలిసి షోను హోస్ట్ చేశారు. మొత్తానికి ఈ షో కూడా అయిపోయింది. సుధీర్ మళ్లీ ఏం చేస్తాడో తెలియడం లేదు. తిరిగి ఈటీవీకి వస్తాడా? స్టార్ మాలోనే ఇంకా ఏదైనా షోను కంటిన్యూ చేస్తాడా? అన్నది చూడాలి. అయితే ఎందుకు అలా వెళ్లిపోయాడన్నది మాత్రం ఇంత వరకు చెప్పలేదు సుధీర్. రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తానని అని ఉంటారు.. అవసరం పడి వెళ్లి ఉండొచ్చు అని సుధీర్ గురించి రాం ప్రసాద్, హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. కానీ సుధీర్ మాత్రం ఇంత వరకు ఈ విషయం గురించి స్పందించలేదు. సుధీర్ ఎక్కడా కూడా నోరు జారడం లేదు. కానీ సుధీర్‌ను మాత్రం ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కలిసి పంపించారు అంటూ శ్రీదేవీ డ్రామా కంపెనీలో రష్మీ కౌంటర్లు వేస్తుంటుంది.
తాజాగా సుధీర్ ఎలా వెళ్లిపోయాడనేది బుల్లెట్ భాస్కర్ కౌంటర్లు వేశాడు. రాజుల స్కిట్ వేశా, డు బుల్లెట్ భాస్కర్. ఓ సొరంగం తవ్వండి.. పక్క రాజ్యాలు దండెత్తినప్పుడు తప్పించుకోవచ్చు అని బుల్లెట్ భాస్కర్‌కి ఫైమా చెబుతుంది. ఇలా చెప్పి చెప్పి.. ఒకడు సొరంగాలు తవ్వి పక్క రాజ్యానికి వెళ్లాడు అంటూ సుధీర్ మీద పరోక్షంగా కౌంటర్లు వేశాడు. సొరంగాల సుధీర్ అని అందరూ ఏడ్పించేసే వారన్న సంగతి తెలతిసిందే..
