Bullet Bhaskar : బుల్లెట్ భాస్క‌ర్ ఇల్లీగ‌ల్ ఎఫైర్.. పెద్ద రిస్క్‌లోనే ప‌డ్డాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bullet Bhaskar : బుల్లెట్ భాస్క‌ర్ ఇల్లీగ‌ల్ ఎఫైర్.. పెద్ద రిస్క్‌లోనే ప‌డ్డాడుగా..!

Bullet Bhaskar : జ‌బ‌ర్ధ‌స్త్ షోలో కాంట్ర‌వ‌ర్సీలు కొత్తేమి కాదు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ కొన్ని కాంట్ర‌వ‌ర్సీ స‌బ్జెక్ట్‌ల‌ని ఎంచుకొని కామెడీ చేస్తుంటారు. ఒక్కోసారి అవి తేడా కొట్ట‌డంతో సారీ చెప్ప‌క త‌ప్ప‌డం లేదు.గతంలో జబర్దస్త్ కమెడియన్స్ హాస్యం కోసం చేసిన కామెంట్స్, గెటప్స్ వివాదాస్పదం అయ్యాయి. హైపర్ ఆది పంచ్ లపై నిరసనలు వ్యక్తం కాగా పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది . బలగం డైరెక్టర్ వేణు మీద గౌడ సామాజిక వర్గం […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2024,3:05 pm

ప్రధానాంశాలు:

  •  Bullet Bhaskar : బుల్లెట్ భాస్క‌ర్ ఇల్లీగ‌ల్ ఎఫైర్.. పెద్ద రిస్క్‌లోనే ప‌డ్డాడుగా..!

Bullet Bhaskar : జ‌బ‌ర్ధ‌స్త్ షోలో కాంట్ర‌వ‌ర్సీలు కొత్తేమి కాదు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ కొన్ని కాంట్ర‌వ‌ర్సీ స‌బ్జెక్ట్‌ల‌ని ఎంచుకొని కామెడీ చేస్తుంటారు. ఒక్కోసారి అవి తేడా కొట్ట‌డంతో సారీ చెప్ప‌క త‌ప్ప‌డం లేదు.గతంలో జబర్దస్త్ కమెడియన్స్ హాస్యం కోసం చేసిన కామెంట్స్, గెటప్స్ వివాదాస్పదం అయ్యాయి. హైపర్ ఆది పంచ్ లపై నిరసనలు వ్యక్తం కాగా పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది . బలగం డైరెక్టర్ వేణు మీద గౌడ సామాజిక వర్గం దాడి చేసింది. గీత కార్మికుల మీద జోక్స్ వేస్తూ ఆయన చేసిన స్కిట్ వివాదానికి దారితీసింది . అయితే గ‌తంలో మాదిరిగా జ‌బ‌ర్ధ‌స్త్‌కి అంత ఇమేజ్ లేదు. దాని కోసం అంద‌రు క‌ష్ట‌ప‌డుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒక‌రైన‌ బుల్లెట్ భాస్కర్ రిస్క్ చేసి మ‌రీ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

Bullet Bhaskar రిస్కీ స్కిట్..

బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కమెడియన్ గా, టీం లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఒకప్పుడు సునామీ సుధాకర్ ఆయన టీమ్ లో ఉండేవాడు. ప్రస్తుతం ఫైమా, పొట్టి నరేష్ తో స్కిట్స్ చేస్తున్నాడు. బుల్లెట్ భాస్కర్ ఈ మధ్య సమకాలీన పరిస్థితులు, సంఘటనల ఆధారంగా స్కిట్స్ రాసుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంఘటనలు తన స్కిట్స్ లో కామెడీగా ప్రెజెంట్ చేస్తున్నాడు. ఎంటైర్ స్కిట్ కొన్ని వార్తల నేపథ్యంలో నడిపిస్తున్నాడు. తాజాగా బుల్లెట్ భాస్కర్ పర్ఫార్మ్ చేసిన ఓ స్కిట్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ స్కిట్ కొద్ది రోజుల క్రితం వైజాగ్ లో ఓ ఇల్లీగల్ వ్యవహారం సంచలనం రేపింది. మోడల్ అండ్ యాక్టర్ అయిన ఓ వ్యక్తి.. భార్య, కూతురుని దూరం పెట్టాడు. మరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని ఫ్లాట్ లో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసిన భార్య కూతురితో పాటు ఆ ఫ్లాట్ ఎదుట బైఠాయించింది. నాకు న్యాయం చేయాలని మీడియాలో కోరుకుంది.

Bullet Bhaskar బుల్లెట్ భాస్క‌ర్ ఇల్లీగ‌ల్ ఎఫైర్ పెద్ద రిస్క్‌లోనే ప‌డ్డాడుగా

Bullet Bhaskar : బుల్లెట్ భాస్క‌ర్ ఇల్లీగ‌ల్ ఎఫైర్.. పెద్ద రిస్క్‌లోనే ప‌డ్డాడుగా..!

ఈ ఉదంతాన్ని స్కిట్ రూపంలో ప్రదర్శించాడు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఫైమా, పొట్టి నరేష్ స్కిట్ లో ఎప్పటిలాగే నవ్వులు పూయించారు. వాస్తవంగా జరిగిన ఇల్లీగల్ ఎఫైర్ ఉదంతాన్ని స్కిట్ రూపంలో బుల్లెట్ భాస్కర్ చక్కగా ప్రజెంట్ చేశాడు. అయితే ఇలాంటి స్కిట్స్ వలన రిస్క్ కూడా ఉంటుంది. అయిన తెలిసి కూడా బుల్లెట్ భాస్కర్ ఈ సాహ‌సం చేశాడంటే ఆయ‌న షోని ఎంత ముందుకు న‌డిపించాల‌ని అనుకుంటున్నాడో అర్ధ‌మ‌వుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది