Jabardasth : కామెడీ స్కిట్ సీరియస్ స్కిట్ అయిందిగా… బుల్లెట్ భాస్కర్ కి గుండు కొట్టించిన జబర్దస్త్ జడ్జిలు..!!
ప్రధానాంశాలు:
Jabardasth : కామెడీ స్కిట్ సీరియస్ స్కిట్ అయిందిగా...
బుల్లెట్ భాస్కర్ కి గుండు కొట్టించిన జబర్దస్త్ జడ్జిలు..!!
Jabardasth : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో కి జనాలలో విపరీతమైన ఆదరణ ఉంది. ఈ షో మొదలై పదేళ్లకు పైనే అవుతున్న ఇప్పటికీ కొనసాగుతుందంటే ఈ షో కి ఎంత ఆదరణ ఉందో తెలిసిపోతుంది. అయితే తాజాగా జబర్దస్త్ షోలో కామెడీగా మొదలైన స్కిట్ సీరియస్ కి దారి తీసింది. జడ్జెస్ మీద అసహన వ్యక్తం చేసిన బుల్లెట్ భాస్కర్ గుండు చేయించుకున్నాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ టీం లీడర్ గా ఉన్నారు. అయితే ఈ వారానికి ‘ నిజం ‘ మూవీ స్పూఫ్ స్కిట్ గా ఎంచుకున్నాడు. బుల్లెట్ భాస్కర్ నిజం సినిమాలోని మహేష్ పాత్ర నాటీ నరేష్ చేశారు. మహేష్ తల్లి పాత్ర మరొకరు చేశారు. ఇక బుల్లెట్ భాస్కర్ విలన్ గోపీచంద్ పాత్ర చేశారు.
నిజం సినిమాలో గోపీచంద్ గెటప్ భయంకరంగా ఉంటుంది. మెయిన్ విలన్ జయప్రకాష్ రెడ్డిని చంపేసి గోపీచంద్ విలన్గా అవతరిస్తాడు. గుండు గీయించుకొని రక్తాభిషేకం చేసుకొని దేవుడు అని చెప్పుకుంటాడు. ఇక నిజం స్పూఫ్ స్కిట్ లో బుల్లెట్ భాస్కర్ గోపీచంద్ పాత్ర చేసిన నేపథ్యంలో గెటప్ సెట్ కాలేదని జడ్జెస్ అన్నారు. ఆ సినిమాలో గోపీచంద్ గుండుతో ఉంటారు..మీరు గుండు చేయించుకోలేదు .. కనీసం ఆ గెటప్ కూడా వేయలేదు అన్నారు. దాంతో ఆవేశానికి గురైన బుల్లెట్ భాస్కర్ జడ్జెస్ ఎదుటిగానే స్టేజ్ మీద గుండు గీయించుకున్నాడు. దాంతో అందరు షాక్ అయిపోయారు.
మేము గుండు గెటప్ వేయమన్నాం కానీ నిజంగా గుండు చేయించుకోమనలేదు అని బుల్లెట్ భాస్కర్ తో జడ్జెస్ అన్నారు. మిమ్మల్ని సంతృప్తి చేయడానికి ఇలా చేయాల్సి వచ్చిందని బుల్లెట్ భాస్కర్ రూడ్ గా ప్రవర్తించాడు. దాంతో జడ్జి కుష్బూకి కోపం వచ్చింది. జడ్జెస్ అంటే గౌరవం లేని చోట నేను ఉండను అని ఆమె లేచి వెళ్ళిపోయింది. వారించిన ఆమె ఆగలేదు. నవ్వులు పండించే జబర్దస్త్ షోలో సీరియస్ పరిణామం అందరిని షాకింగ్ కి గురి చేసింది. ఇక నిజంగా బుల్లెట్ భాస్కర్ గొడవపడ్డాడా లేక ప్రోమో కోసం ఇలా చేశాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఈ షోకి గెస్ట్ గా బేబీ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్ కూడా వచ్చారు.