Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంతకంటే గుడ్ న్యూస్ ఉంటుందా ?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా సినిమా ఎంట్రీ ఇచ్చిన… ఏమాత్రం చిరంజీవి ఇమేజ్ తనపై పడకుండా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. దాదాపు కొన్ని దశాబ్దాల పాటు యువతరాన్ని ప్రభావితం చేసే హీరోగా… సత్తా చాటుతూ ఉన్నాడు. వరుస పెట్టి ఏడు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి.. పది సంవత్సరాలు పాటు హిట్ లేకుండా టాప్ హీరోగా ఇండస్ట్రీలో రాణించటం జరిగింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పవన్ 27 సంవత్సరాలు అయింది.
ఈ 27 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు చూస్తే 27. ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయడం జరిగింది. అయితే అభిమానులు మొదటి నుండి ఏడాదికి రెండు సినిమాలైనా చేస్తే బాగుంటుందని… ఎప్పటినుండో కోరుతూ ఉన్నారు. అయితే అనూహ్యంగా 2023 సంవత్సరం అనగా ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ వరుస పెట్టి మూడు సినిమా షూటింగ్లలో పాల్గొనడం విశేషం. సాయి ధరమ్ తేజ్ తో వినోదయ సీతం రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్”, సుజిత్ దర్శకత్వంలో “OG” సినిమాలు చేస్తూ ఉన్నారు.
క్రిష్ దర్శకత్వంలో ఆల్ రెడీ “హరిహర వీరమల్లు” కంప్లీట్ చేయడం జరిగింది. ఇది త్వరలో విడుదలకు సిద్ధంగా కూడా ఉంది. సో మొత్తం మీద చాలా సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నట్లు పవన్ ఏకంగా ఇప్పుడు మూడు సినిమాల షూటింగ్లలో ఒకే ఏడాదిలో పాల్గొనటం జరిగింది. ఇది కచ్చితంగా పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదిలోనే పవన్ ఈ రీతిగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే పవన్ ఫ్యాన్స్ కి పండగే అని అంటున్నారు.