Rashmika Mandanna : ఇది చాలా దారుణం.. రష్మిక ఫేక్ వీడియో పై స్పందించ‌ని టాలీవుడ్‌.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : ఇది చాలా దారుణం.. రష్మిక ఫేక్ వీడియో పై స్పందించ‌ని టాలీవుడ్‌.. !

 Authored By aruna | The Telugu News | Updated on :7 November 2023,10:00 pm

ప్రధానాంశాలు:

  •  రష్మిక ఫేస్ మార్ఫింగ్

  •  Rashmika Mandanna : ఇది చాలా దారుణం.. రష్మిక ఫేక్ వీడియో పై స్పందించ‌ని టాలీవుడ్‌.. !

  •  రష్మిక ఫేక్ వీడియో పై స్పందించ‌ని టాలీవుడ్‌.. !

Rashmika Mandanna : ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు చెడు వీడియోలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆ టెక్నాలజీనే ఉపయోగించి రష్మిక ఫేస్ ని మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. బ్రిటిష్ ఇండియన్ అమ్మాయి అయినా జరా పటేల్ వీడియోకు రష్మిక ఫేస్ ని పెట్టి వీడియోని క్రియేట్ చేయగా, అది ఇప్పుడు దేశం వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇలాంటి ఫేక్ వీడియోలు ఏఐ వీడియోలను కట్టడీ చేయాలని సోషల్ మీడియాలో మారూమ్రోగిపోతుంది. ఈ వీడియో పై రష్మిక మందన స్పందించారు.

ఈ వీడియో తనను చాలా బాధించిందని, అదే ఒకవేళ స్కూల్ ఏజ్ లో ఉంటే ఏమయ్యేదాన్నో అంటూ బాధను వ్యక్తపరిచారు. ఇప్పటికే ఈ వీడియో పై చాలామంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. బిగ్ బి అమితాబచ్చన్ ఇలాంటి వీడియోలు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ వీడియో పై నాగచైతన్య, సాయి ధరంతేజ్, మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఇలాంటి వీడియోలు చూస్తే చాలా బాధగా ఉంది. టెక్నాలజీని చెడుగా వాడుకోవడం చాలా బాధాకరం. ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను తీసుకువస్తుందో. తలచుకుంటేనే భయంగా ఉంది. ఇలాంటి పనులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని నాగచైతన్య ట్వీట్ వేశారు.

సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ ఎంతో బాధగా, సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఇంత గొప్ప టెక్నాలజీని చెడుగా వాడటం, దాని వలన బాధితులు ఎంత నరకాన్ని అనుభవిస్తారో తలుచుకుంటేనే బాధేస్తుంది. దీనివలన భవిష్యత్తులో భయంకర పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించి కొత్త చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ ఇలాంటి పనులు చేసే వారిని తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. వారిలో కొంచెం కూడా మంచితనం లేదనిపిస్తుంది. ఇలాంటి వాటి మీద మాట్లాడకుండా చాలామంది సైలెంట్ గా ఉంటారు. అమ్మాయి శరీరాన్ని ఇష్టమొచ్చినట్లుగా మార్ఫింగ్ చేస్తుంటారు. ఈ సమాజం ఎటు పోతుందో. సెలబ్రిటీలు అయినందుకు మీరు ఇలా చేస్తారా. ఇదే టైం అందరూ దీనిపై నోరు విప్పండి, ప్రశ్నించండి అంటూ మృణాల్ పోస్ట్ చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది