
Censor Board Changes Liger Movie Scenes.. Cut key scenes?
Liger Movie : విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియన్ మూవీ లైగర్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఈనెల 25న దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.దీనిని హీరో విజయ్‌తో పాటు దర్శకుడు పూరిజగన్నాథ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరికి ఇస్మార్ట్ శంకర్ కొంత ధైర్యాన్ని అందించింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిన లైగర్ హిట్ అయితే పూరి ఈజ్ బ్యాక్ అని అంతా అనుకుంటారు. ఈ సినిమా తర్వాత కూడా పూరి మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
ఇక లైగర్ చిత్రంలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రను పోషిస్తుంది. హీరోయిన్‌గా అనన్య పాండే నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నాడు.కాగా, రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు మెంబర్స్ భారీ షాక్ ఇచ్చారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి వలన సినిమాకు వచ్చిన జనాలు ఇబ్బందికరంగా ఫీల్ అవుతారని భావించి మొత్తం 7 సీన్లను డిలీట్ చేయాల్సిందిగా మూవీ మేకర్స్‌ను బోర్డు సభ్యులు కోరారు.ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే లైగర్ సినిమా మొత్తానికి ఈ సీన్స్ హైలైట్‌గా మారుతాయని మూవీ టీం చెబుతోంది.
Censor Board Changes Liger Movie Scenes.. Cut key scenes?
పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్‌తో రౌడీ బాయ్ విజయ్ కాంబినేషన్ అంటే జనాల్లో ఆ మాత్రం అంచనాలు ఉంటాయి. బోల్డ్ సీన్స్ బోల్డ్ డైలాగ్స్ ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. మరి సినిమాకు హైలెట్ అయిన ఆ ఏడు సీన్స్‌ను సెన్సార్ సభ్యులు కట్ చేయమని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
సినిమాకు గుండెకాయ వంటి ఆ ఏడు సీన్లకు కట్ చేస్తే పరిస్థితి ఏంటనేది అసలైన సమస్య. సెన్సార్ రివ్యూ ప్రకారం ఆ సీన్స్ కట్ చేస్తే సినిమా ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది. ఈ సీన్స్ లేకుండా సినిమా విడుదలైతే విజయ్ హిట్ కొడతాడో లేదో వేచిచూడాల్సిందే.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.