Liger Movie : లైగర్ మూవీ టీంకు షాకిచ్చిన సెన్సార్ బోర్డు.. కీలక సీన్లు కట్?

Authored By aruna | The Telugu News | Published on: August 19, 2022, 5:21 pm

Liger Movie : విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియన్ మూవీ లైగర్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఈనెల 25న దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.దీనిని హీరో విజయ్‌తో పాటు దర్శకుడు పూరిజగన్నాథ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరికి ఇస్మార్ట్ శంకర్ కొంత ధైర్యాన్ని అందించింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిన లైగర్ హిట్ అయితే పూరి ఈజ్ బ్యాక్ అని అంతా అనుకుంటారు. ఈ సినిమా తర్వాత కూడా పూరి మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

ఇక లైగర్ చిత్రంలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రను పోషిస్తుంది. హీరోయిన్‌గా అనన్య పాండే నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నాడు.కాగా, రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు మెంబర్స్ భారీ షాక్ ఇచ్చారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి వలన సినిమాకు వచ్చిన జనాలు ఇబ్బందికరంగా ఫీల్ అవుతారని భావించి మొత్తం 7 సీన్లను డిలీట్ చేయాల్సిందిగా మూవీ మేకర్స్‌ను బోర్డు సభ్యులు కోరారు.ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే లైగర్ సినిమా మొత్తానికి ఈ సీన్స్ హైలైట్‌‌గా మారుతాయని మూవీ టీం చెబుతోంది.

Liger Movie : సినిమాకే హైలెట్ అయిన సీన్లు..

పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్‌తో రౌడీ బాయ్ విజయ్ కాంబినేషన్ అంటే జనాల్లో ఆ మాత్రం అంచనాలు ఉంటాయి. బోల్డ్ సీన్స్ బోల్డ్ డైలాగ్స్ ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. మరి సినిమాకు హైలెట్ అయిన ఆ ఏడు సీన్స్‌ను సెన్సార్ సభ్యులు కట్ చేయమని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.

సినిమాకు గుండెకాయ వంటి ఆ ఏడు సీన్లకు కట్ చేస్తే పరిస్థితి ఏంటనేది అసలైన సమస్య. సెన్సార్ రివ్యూ ప్రకారం ఆ సీన్స్ కట్ చేస్తే సినిమా ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది. ఈ సీన్స్ లేకుండా సినిమా విడుదలైతే విజయ్ హిట్ కొడతాడో లేదో వేచిచూడాల్సిందే.

aruna

No bio available for this author.

  1. "Gunde Ninda Gudi Gantalu Today Episode : సుమతి, అరుణ్ పెళ్లి కోసం మీనా సంచలన నిర్ణయం.. బాలు మాటలతో కన్నీళ్లు!"

  2. "Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!"

  3. "Nara Lokesh CM : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్?.. సీఎంగా లోకేష్.. చంద్రబాబు పాత్ర ఏంటనే చర్చ!"

  4. "Bigg Boss 10 Telugu : ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ.. త్రిగుణ్‌కు షాకిచ్చిన ముకేష్.. ఓటింగ్‌లో కొత్త లెక్కలు !"

  5. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

  6. "China USA Gold : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. భారీగా బంగారం కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి..?"

  7. "Rashmika Mandanna : రష్మిక కొత్త లుక్ అదుర్స్.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాట లాంచ్‌లో నేషనల్ క్రష్ సందడి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp