Ashu Reddy : చీచీ.. ఇదెక్కడి చెండాలం.. అషూ రెడ్డిపై ఉమ్మేసిన చైతూ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashu Reddy : చీచీ.. ఇదెక్కడి చెండాలం.. అషూ రెడ్డిపై ఉమ్మేసిన చైతూ

 Authored By sandeep | The Telugu News | Updated on :1 March 2022,12:00 pm

Ashu Reddy: బిగ్ బాస్ ఓటీటీ షో ఇప్పుడు తెగ సంద‌డి చేస్తుంది. ఇటీవ‌ల 17 మంది కంటెస్టెంట్స్‌తో షో మొద‌లు కాగా, ఇందులో జూనియ‌ర్స్, సీనియ‌ర్స్ తెగ సంద‌డి చేస్తున్నారు. అయితే షో మూడో రోజుకి చేరుకుంది. సోమవారం జనరల్‌గా నామినేషన్స్ ఉంటాయి. ఈ ప్రక్రియ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. మొదటి వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో నటరాజ్‌ మాస్టర్‌, అరియానా, సరయు, హమీద, ముమైత్‌ ఖాన్‌, మిత్రా శర్మ, ఆర్జే చైతూ నామినేట్‌ అయ్యారు. మరి మొదటి వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చూడాలి.అయితే హౌజ్‌లోని కంటెస్టెంట్స్ వారికి వారే టాస్కులు ఇచ్చుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నారు.

సీనియర్స్‌లా భావిస్తున్న వారియర్స్‌కు షాకిస్తూ చాలెంజర్స్‌కు ఆధిపత్యం చెలాయించే అవకాశమిచ్చాడు బిగ్ బాస్. ఛాలెంజర్స్‌ అనుమతి లభించిన ఒక వారియర్‌ మాత్రమే బెడ్రూమ్‌లో నిద్రపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. చాలెంజర్స్‌ భోజనం చేశాక వారియర్స్‌ విందు ఆరగించాలని కండీషన్‌ పెట్టాడు.వారియర్స్‌ అందరూ మాజీ కంటెస్టెంట్లే కాబట్టి వారికి హౌస్‌ను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలన్న అవగాహన ఉంటుంది. దీంతో ఇంటి పనులన్నీ వారియర్స్‌కే అప్పజెప్పాడు. ఒకవేళ పనులు చేయకపోతే జూనియర్స్‌ అయిన చాలెంజర్స్‌ వారిని శిక్షించవచ్చన్నాడు. ఇక వారియర్స్‌తో సేవలు చేయించుకునే అవకాశం ఉండటంతో చైతూ.. అషూని ఓ ఆటాడుకున్నాడు.

chaitu spits on ashu reddy

chaitu spits on ashu reddy

Ashu Reddy : చైతూ ప్ర‌వ‌ర్త‌న‌పై ఫైర్

వాటర్‌ తీసుకురమ్మని చెప్పడంతో ఆమె బాటిల్‌లో నీళ్లు తీసుకొచ్చింది. తాగించమని చైతూ అడగడంతో అషురెడ్డి తాగించింది. అలా తాగిస్తున్న క్రమంలో చైతూ నీళ్లను ఊసేయడంతో అవి అషూ మీద పడ్డాయి. దీంతో హౌస్‌మేట్స్‌ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.బిగ్ బాస్ ఓటీటీకి కూడ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మూడో సీజ‌న్ నుండి నాగార్జున పూర్తిగా బిగ్ బాస్ కి స్టిక్ అయ్యారు. కొంద‌రు అత‌నిపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం నాగార్జున హోస్టింగ్ బాగుందంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది