Chalaki Chanti : చలాకీ చంటి బిగ్ బాస్‌కి వెళ్లడానికి అసలు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Chalaki Chanti : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో సీజన్స్ మీద సీజన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కాగా, ఇందులో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చలాకీ చంటీ కూడా ఈ సారి బిగ్ బాస్ షోలో సందడి చేయబోతున్నాడు. ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించినా ప్రముఖ కామెడీ షోతోనే చలాకీ చంటీ పాపులర్ అయ్యాడు. 2016 ఏప్రిల్‌లో ఇతనికి వివాహం జరిగింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు టీవీ షోలతో అలరించే చంటీ బిగ్‌బాస్ సీజన్-6లో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చంటి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేముందు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను తెలిపారు. జబర్దస్త్ కు రావడానికి ముందే పలు చిత్రాల్లో నటించిన చంటి.. ఈషోతోనే ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనను వెళ్లగొట్టడానికి ‘జబర్దస్త్’లో జరిగిన కుట్రలను వెల్లడించారు. నాగార్జున నోట తన ‘చంటి’అనే పేరు వినాలని ఆశించానన్నారు. తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ తనకు సపోర్ట్ చేయాలని కోరారు. అయితే ‘బిగ్ బాస్ తెలుగు 6’కు వచ్చేముందు ‘మల్లెమాల’లో జరిగిన విషయాలను రివీల్ చేశారు.తన రెమ్యునరేషన్ పెంచమని కోరగా, మల్లెమాల వాళ్లు.. ‘నీ టాలెంట్ ఇదే ఎక్కువ’ అంటూ అనడం తనను బాధించిందన్నారు.

Chalaki Chanti is the real reason for going to Bigg Boss
Chalaki Chanti : అంత జరిగిందా?
మరోవైపు తను ముక్కుసూటి మనిషినని, తప్పు జరిగితే వెంటనే ప్రశ్నిస్తానని అన్నారు. అలా ఎప్పటికప్పుడు ప్రశ్నించడం మూలంగా తనను ‘కోపిష్టి, పొగరు, అటిట్యూడ్, ఈగో’ అంటూ తనను ముద్రవేశారని తెలిపారు. చంటి ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో తెగ రచ్చ చేయడంతో పాటు ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాడని అందరు భావిస్తున్నారు. బింబిసార స్టైల్ లోనే ఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ లో కూడా చంటిసారగా అడుగు పెట్టారు. ఈసారి టైటిల్ నాదే అని ధైర్యంగా చెప్పాడు. ఇక తర్వాత నాగార్జునను చూసిన సంతోషంలో ఇది నిజమా కల అంటూ ఆశ్చర్యపోయాడు. అలాగే తన ఫ్యామిలీ గురించి తన భార్య గురించి కూడా చంటి సరదాగా తెలియజేశాడు. అలాగే లోపల మాత్రం అందరిని ఎంటర్టైన్ చేస్తాను అని చంటి వివరణ ఇచ్చాడు