
Chandra Mohan : టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆయన అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఆయన పెద్ద కూతురు మధుర మీనాక్షి అమెరికాలో ఉండడం, ఆమె రావడానికి ఆలస్యం కావడం, ఆదివారం రోజు దీపావళి పండుగ కావడం వలన ఆయన అంత్యక్రియలను సోమవారం రోజున కుటుంబ సభ్యులు నిర్వహించారు.
అయితే శనివారం నుంచి ఆయన పార్టీవదేహాన్వి ఆయన నివాస స్థలంలోనే ఉంచగా అక్కడికి ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో పాటు అభిమానులు కూడా వెళ్లారు. ఆయనను కడసారిగా చూసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక సోమవారం రోజు ఉదయం ఫిలింనగర్ లోని చంద్రమోహన్ ఇంటి నుంచి అంతిమయాత్ర బయలుదేరింది. ఆ అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఆయనను తలుచుకుంటూ భార్య, కూతుర్లు, మనవరాలు కన్నీరు పెట్టుకున్నారు. ఇలా పంజాగుట్ట లోని స్మశాన వాటిక వరకు వచ్చి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
చంద్రమోహన్ కి ఇద్దరు కూతుర్లు కావడంతో ఆయన అంతిమ సంస్కారాలు ఆయన సోదరుడైన మల్లంపల్లి దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు చేశారు. అంత్యక్రియల తర్వాత అంతా ఇంటికి చేరుకున్నారు. అంతిమయాత్రకు చాలామంది సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్, జీవిత రాజశేఖర్, ఆది శేషగిరిరావు ఆయన పార్దీవ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. ఇక లెజెండరీ బ్రహ్మానందం చంద్రమోహన్ చనిపోయాడు అన్న విషయం తెలుసుకున్న వెంటనే శనివారం రోజే ఆయనను చూడడానికి వెళ్లారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.