
natural star nani funny comments on jr ntr son
Natural Star Nani : తెలుగు పరిశ్రమలో నాచురల్ స్టార్ గా నాని ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. ఒక్కో సినిమాకి ఒక్కో వేరియేషన్ చూపిస్తూ తన ఏంటో నిరూపించుకుంటున్నాడు. ఇక తాజాగా నాని ‘ హాయ్ నాన్న ‘ సినిమా చేశారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచారం జోరును పెంచింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ హోస్ట్ గా వ్యవహరించిన ఓ ఇంటర్వ్యూకి నాని, ఈ సినిమాలో నటించిన పాప కియారా ఖన్నా హాజరయ్యాడు. సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే ప్రమోషన్ లో భాగంగా సుమ నానితో సరదాగా ఓ ఆట ఆడించారు. హీరోల కొడుకుల చిన్నప్పటి ఫోటోలు చూపించి వాళ్లెవరో చెప్పాలని అన్నారు. ఈ క్రమంలో నే జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫోటో చూపించారు. మొదట నాని గుర్తుపట్ట లేకపోయినా కొద్దిసేపటి తర్వాత తారక్ చిన్న కొడుకా అని అన్నారు. అవును అని సుమ అన్నారు. తారక్ చిన్ను కొడుకు చాలా కచ్చి అని నాని అన్నారు. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. హిందీలో హాయ్ పాపా పేరుతో మిగతా భాషల్లో ఆయా ప్రాంతీయంగా ఏమి పిలుస్తారో, అదే టైటిల్తో విడుదల చేస్తున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్ లో చూపించారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. అందులో మృణాల్ ఠాకూర్ క్యూట్ లుక్స్ తో ఫిదా చేశారు. ఈ సినిమాలో చిన్నారిగా నటించిన పాప పేరు కియారా. ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా యూనిట్ జోరుగా పాల్గొంటున్నారు. జెర్సీ సినిమాలో తండ్రి తనయుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కితే ఇప్పుడు చేస్తున్ హాయ్ నాన్న సినిమా మాత్రం తండ్రీ కూతుర్ల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ గ్లింప్స్ కూడా ఎంతో ఎమోషనల్తో కూడింది. మొత్తానికి నాని తనకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సబ్జెక్టుతో వస్తున్నాడు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.