Chandra Mohan : చంద్రమోహన్ అంత్య క్రియలు.. వెక్కి వెక్కి ఏడ్చిన భార్య, కూతుళ్లు, మనవరాళ్లు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandra Mohan : చంద్రమోహన్ అంత్య క్రియలు.. వెక్కి వెక్కి ఏడ్చిన భార్య, కూతుళ్లు, మనవరాళ్లు..!!

Chandra Mohan : టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆయన అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఆయన పెద్ద కూతురు మధుర మీనాక్షి అమెరికాలో ఉండడం, ఆమె రావడానికి ఆలస్యం కావడం, ఆదివారం రోజు దీపావళి పండుగ కావడం వలన ఆయన అంత్యక్రియలను సోమవారం […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 November 2023,7:00 pm

Chandra Mohan : టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆయన అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఆయన పెద్ద కూతురు మధుర మీనాక్షి అమెరికాలో ఉండడం, ఆమె రావడానికి ఆలస్యం కావడం, ఆదివారం రోజు దీపావళి పండుగ కావడం వలన ఆయన అంత్యక్రియలను సోమవారం రోజున కుటుంబ సభ్యులు నిర్వహించారు.

అయితే శనివారం నుంచి ఆయన పార్టీవదేహాన్వి ఆయన నివాస స్థలంలోనే ఉంచగా అక్కడికి ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో పాటు అభిమానులు కూడా వెళ్లారు. ఆయనను కడసారిగా చూసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక సోమవారం రోజు ఉదయం ఫిలింనగర్ లోని చంద్రమోహన్ ఇంటి నుంచి అంతిమయాత్ర బయలుదేరింది. ఆ అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఆయనను తలుచుకుంటూ భార్య, కూతుర్లు, మనవరాలు కన్నీరు పెట్టుకున్నారు. ఇలా పంజాగుట్ట లోని స్మశాన వాటిక వరకు వచ్చి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

చంద్రమోహన్ కి ఇద్దరు కూతుర్లు కావడంతో ఆయన అంతిమ సంస్కారాలు ఆయన సోదరుడైన మల్లంపల్లి దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు చేశారు. అంత్యక్రియల తర్వాత అంతా ఇంటికి చేరుకున్నారు. అంతిమయాత్రకు చాలామంది సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్, జీవిత రాజశేఖర్, ఆది శేషగిరిరావు ఆయన పార్దీవ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. ఇక లెజెండరీ బ్రహ్మానందం చంద్రమోహన్ చనిపోయాడు అన్న విషయం తెలుసుకున్న వెంటనే శనివారం రోజే ఆయనను చూడడానికి వెళ్లారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది