surekha vani : సురేఖ వాణికి ఊహించని పరిణామం… పెళ్లి చేసుకుంటానన్న అభిమాని.. పోస్ట్ వైరల్..!
surekha vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. సంప్రదాయమైన చీర కట్టులో తెలుగు మహిళగా ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా నిలుస్తూ ఎన్నో సినిమాల్లో పద్ధతిగా నటించింది. అయితే కోవిడ్ లాక్ డౌన్ నుంచి ఆమె తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. వెండితెరపై వేసే పాత్రలకు పూర్తి బిన్నంగా గత లాక్ డౌన్ లో తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో.. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ రచ్చ చేసింది. అప్పట్లో ఈ వీడియోలు ఆమెకు మరింత క్రేజ్‌ను కూడా సంపాదించి పెట్టాయి. అయితే తాజాగా సురేఖా వాణి మరోసారి వార్తల్లో నిలిచింది.
సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.సినిమాల్లో చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించే సురేఖ వాణి.. చేతిలో రెడ్ వైన్ ఉన్న గ్లాస్‌తో ఉన్న ఫొటో పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. తన గ్లామర్ తో కుర్రాళ్ళ చూపులను తనవైపుకు తిప్పుకుంది. ఈ హాట్ ఫొటోను చూసిన నెటిజన్స్ అంతా ఇక కామెంట్స్ రూపంలో తమ స్టైల్లో రెచ్చిపోయారు. అందులో ఒకరేమో సూపర్ మేడం అంటూ పొగడగా.. మరొకరైతే ఏకంగా.. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని కామెంట్ పెట్టి షాక్ ఇచ్చాడు. వేరొక అతను. బీర్ తాగకండి మేడమ్ బొజ్జ వచ్చేస్తుందని ఉచిత సలహా ఇచ్చాడు.

charecter artist surekha vani instagram post viral
surekha vani : ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా..!
అయితే ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.సురేఖవాణి ఆ మద్యన బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో దిగి అందాల ప్రదర్శన చేసింది. ఆ ఫొటో వైరల్ అయ్యింది. ఆ కొద్ది రోజులకే మరోసారి ఆమె బాత్రూమ్ టవల్ తో కనపడింది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు రకరకాల కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఇంతకుముందు ఆమెను కుటుంబ పాత్రల్లో చూసిన పలువురు తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రం… ప్రస్తుతం సురేఖ వాణి ఫొటోలు చూసి షాక్ అవుతున్నారు.
View this post on Instagram