Chaurya Paatam : ఓటీటీలో 'చౌర్య పాఠం' నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే ‘చౌర్య పాఠం’ (Chaurya Paatam). తాజాగా ఈ సినిమా ఓటీటీలో సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకంగా 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసి, డిజిటల్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసింది. థియేటర్లలో సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ, డిజిటల్ స్క్రీన్లను షేక్ చేస్తోంది.స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే.
Chaurya Paatam : ఓటీటీలో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!
కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు. తన మొదటి సినిమాను నిర్మించాలనే తీవ్రమైన ఆకాంక్షతో, నిధుల కోసం ధనపల్లి అనే గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ఒక చిన్న ముఠాతో కలిసి పథకం వేసే దర్శకుడిగా అతడి నటన ఆకట్టుకుంటుంది. పేరులో ‘చౌర్యం’ అని ఉన్నా, సినిమా చూశాక వచ్చే ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్. దొంగతనం చుట్టూ తిరిగే కథే అయినా, నిజాయితీ, ధైర్యం, మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ, ప్రతి ఒక్కరి గుండెను తడుతుంది.
‘చౌర్య పాఠం’ కేవలం ఒక సినిమాగా మిగిలిపోకుండా, ఓటీటీ వేదికపై ఓ లైవ్ డిస్కషన్ పాయింట్‌గా మారింది. సింపుల్‌గా కనిపించే కథలో ఎమోషనల్ డెప్త్ చూపించడమే ఈ సినిమా స్పెషాలిటీ. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. సంగీతం కూడా సినిమాకు ఒక ప్లస్ పాయింట్. ఇంకా చూడకపోతే దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూసేయొచ్చు.
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
This website uses cookies.