Chhaava : బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన ‘చావా’ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chhaava : బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన ‘చావా’

 Authored By ramu | The Telugu News | Updated on :11 March 2025,10:10 pm

ప్రధానాంశాలు:

  •  Chhaava : బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన 'చావా'

Chhaava : విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ‘చావా’ సినిమా బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రలో నటించగా..ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న కనిపించింది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ నరేషన్ అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. కథ, నటన, నిర్మాణ విలువల పరంగా బాలీవుడ్‌లో ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ సెట్ చేయడం విశేషం. ‘చావా’ విజయంతో విక్కీ కౌశల్ తన కెరీర్‌లో మరొక మైలురాయి అందుకున్నాడు.

Chhaava : బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన 'చావా'

Chhaava : బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన ‘చావా’

Chhaava : చావా ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం 25 రోజుల్లోనే రూ.516 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ చలనచిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘చావా’ ఆరో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ రూ.510 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘చావా’ ఆ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించింది.

ఇదిలా ఉంటె ఓటీటీ విడుదలపై భారీ ఆసక్తి నెలకొంది. ‘చావా’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెటిక్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, ప్రేక్షకుల్లో సినిమా కోసం ఉత్సాహం నెలకొంది. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం, ఓటీటీలోనూ అదే స్థాయిలో విజయం సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది