Jai Bheem Movie Chinatalli : ఆ సినిమా కోసం ఎలుకనే తినాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు వెల్లడించిన సినతల్లి
Jai Bheem Movie Chinatalli : లిజొమోల్ జోస్ అంటే ఎవ్వరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ.. సినతల్లి అంటే చాలు.. టక్కున గుర్తుపట్టేస్తారు. తను ఎవరో కాదు.. జైభీమ్ సినిమాలో తన భర్తను కాపాడుకోవడం కోసం సినతల్లి చేసిన పోరాటాలు అందరినీ మెప్పించాయి. తను ఆ సినిమాలో నటించలేదు. ఆ పాత్రలో జీవించింది. అందుకే ఆ పాత్రకు బాగా మార్కులు పడ్డాయి. అందరూ జేజేలు పలికారు.ఆ సినిమా విడుదలై ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా సూర్య నటనకు అందరూ శభాష్ అంటున్నారు.
సూర్య తర్వాత అంత పాపులారిటీ తెచ్చుకున్నది లిజొమోల్ జోసే. తన నటనతో అందరినీ మైమరిపింపజేసింది జోస్.ఆ సినిమాలో తను ఓ గిరిజన అమ్మాయిగా నటించింది. అందుకే.. సినిమా షూటింగ్ కు ముందే.. తను ఓ గిరిజన గూడేనికి వెళ్లిందట. వాళ్లు చేసే పనులను దగ్గరుండి గమనించిందట. వాళ్ల ఆచారా వ్యవహారాలు, ఆహారం.. అన్నింటిని అక్కడ చూసే నేర్చుకుందట సినతల్లి.
Jai Bheem Movie Chinatalli : గిరిజన అమ్మాయిగా కనిపించడం కోసం చాలా నేర్చుకున్నా
గిరిజనులు తమ పొలాల్లో దొరికే ఎలుకలను వేటాడి వాటిని చంపి వండుకొని తింటారు. నేను అక్కడికి వెళ్లినప్పుడు నేను కూడా ఆ ఎలుకల కూర తిన్నా. అది నాకు అచ్చం చికెన్ లాగానే అనిపించింది. వాళ్లు ఏం చేస్తుంటారో అదే చేసి సినిమాలో నటించకుండా.. జీవించాలని అనుకున్నా. అందుకే.. ఎలుకల కూరను కూడా తిన్నా. పాముకాటు వేస్తే ఎలా మందు వేయాలో.. ఏ చెట్ల ఆకుల రసాన్ని రుద్దాలో కూడా అక్కడ చూసే నేర్చుకున్నా.
అదే నాకు సినిమాలోనూ ఉపయోగపడింది. కేవలం సినిమా కోసమే ఇవన్నీ నేర్చుకున్నా.. గిరిజనుల సంప్రదాయాలు మాత్రం నాకు బాగా నచ్చాయి. వాళ్ల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ప్రకృతికి దగ్గరగా జీవించడం అన్నీ నచ్చాయి.. అంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సినతల్లి.