Home » Entertainment » Chiranjeevi Acharya Movie Teaser Released
Entertainment

Acharya Teaser : ఆచార్య నుంచి బిగ్ అప్‌డేట్ .. టీజర్ అండ్ రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ ..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: January 29, 2021, 5:37 pm
Advertisement

Acharya Teaser : ఆచార్య సినిమా నుంచి మెగా అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న బిగ్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ అప్‌డేట్ తో మెగా అభిమానుల్లో ఆనందం.. ఉత్సాహం రెట్టింపు అయింది. గత కొన్ని నెలలుగా వేయిట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాటీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

Chiranjeevi Acharya Movie Teaser Released

మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేస్తోంది. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ సాగుతున్న ఆచార్య సినిమాలో రాం చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సిద్ద గా కనిపించబోతున్న రాం చరణ్ గెటప్ సినిమాలో హైలెట్ గా ఉండబోతోంది. అంతేకాదు ఇంటర్వెల్ కి ముందు చరణ్ ఎంట్రీ ఉండబోతుందని సమాచారం. కాగా మొదటిసారి చిరంజీవి – చరణ్ కలిసి బిగ్ స్క్రీన్ మీద దాదాపు గంటసేపు సందడి చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రతీ ఒక్కరిలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలని మరో రేంజ్ కి తీసుకు వెళ్ళేందుకు టీజర్ రిలీజ్ చేశారు.

Advertisement

Acharya Teaser : ఆచార్య టీజర్ లో హైలెట్స్ ఇవే..రాసి పెట్టుకోండి ఇండస్ట్రీ పక్కా ..!

రాం చరణ్ వాయి ఓవర్ తో మొదలైన ఆచార్య టీజర్ లో మెగాస్టార్ యాక్షన్ అదిరిపోయింది. ఇతరుల కోసం జీవించేవారు దైవం తో సమానం..అలాంటివారి జీజితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు.. అంటూ చరణ్ .. చిరంజీవిని పరిచయం చేశాడు. భారీ ఫైట్ సీక్వెన్స్ తర్వాత ‘ పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు.. బహుషా గుణపాఠాలు చెప్తానని ఏమో’ అన్న మెగాస్టార్ డైలాగ్ తో టీజర్ పీక్స్ కి చేరుకుంది.

Advertisement

కాగా ఆచార్య సినిమాని భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా మే 13 న రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసిన ఈ అప్‌డేట్ వదిలారు మేకర్స్.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి