Acharya Teaser : ఆచార్య టీజర్ అప్డేట్.. వచ్చేది ఎప్పుడంటే?
Chiranjeevi Acharya Teaser : మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి ఆచార్యపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేలా ముందడగు వేశాడు. ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఇన్నాళ్లు ఎదురుచూశారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఏదైనా అప్డేట్ వస్తుందా? అని చూశారు. అలా రాకపోవడంతో కనీసం సంక్రాంతికైనా అప్డేట్ వస్తుందని ఎంతో ఆశలు పెంచుకున్నారు. కానీ అది కూడా నెరవేరలేదు. కానీ గత ఐదారు రోజులుగా ఆచార్య టీజర్‌పై నానా రకాల వార్తలు వచ్చాయి. అలాంటి రూమర్లపై స్పందిస్తూ.. చిరు తనదైన శైలిలో అప్డేట్ గురించి చెప్పాడు.
తానే ఓ మీమ్ క్రియేట్ చేసిన మెగా స్టార్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆచార్య అప్డేట్ రావడం ఏమో గానీ దానిపై చిరు చేసిన మీమ్, వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. అప్డేట్ ఇస్తావా? లేదా నేనే లీక్ చేయడానికి రెడీగా ఉన్నానంటూ కొరటాలకు చిరు వార్నింగ్ ఇచ్చేశాడు. ఆ దెబ్బతో నేటి ఉదయం పది గంటలకు అప్డేట్ ఇస్తానని కొరటాల శివ కమిట్ అయ్యాడు. చెప్పినట్టుగానే కొరటాల శివ ఆచార్య టీజర్ అప్డేట్‌ను తాజాగా విడుదల చేశాడు.

Chiranjeevi Acharya Teaser on 29th january Released
Acharya Teaser : 29న సాయంత్ర నాలుగు గంటలకు ఆచార్య టీజర్
ఇందులో ఆచార్యకు మీనింగ్ చెప్పారు.. ఎన్నో కష్టాలు పడ్డాం.. చిరంజీవి గారు మళ్లీ సెట్‌లొకి వచ్చారు.. ఎంతో గ్యాప్ తరువాత వచ్చాం.. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం.. చివరకు మా కష్టాన్ని, మా ప్రేమని చూపించేందుకు వస్తున్నామని చెబుతూ జనవరి 29న సాయంత్ర నాలుగు గంటల ఐదు నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయబోతోన్నట్టు కొరటాల శివ ప్రకటించేశాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియోలో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
