Dil Raju : చిరంజీవి, బాలకృష్ణలను భయపెడుతున్న దిల్‌ రాజు.. ఇది నిర్మాత పవర్‌

Dil Raju : మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. ఒక రోజు అటు ఇటుగా ఈ రెండు సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీ అవుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమా లు కూడా ఒకే సారి విడుదల అవ్వడం తో థియేటర్ల సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి అంటే తెలుగు సినిమా కు పెద్ద సీజన్. ఆ సీజన్ లో కాస్త తక్కువ థియేటర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది అంటూ చాలా మంది నమ్ముతూ ఉంటారు.

గతంలో ఈ ఇద్దరు హీరోలు కూడా సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అయ్యారు. కనుక ఈ సారి కూడా తప్పకుండా సక్సెస్ అవుతారని అంతా భావిస్తున్నారు. కానీ ఈసారి ఈ ఇద్దరు హీరోలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భయపెడుతున్నాడు అంటూ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు దిల్ రాజు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. ఆయన ఏ సినిమా కు చెబితే ఆ సినిమా కోసం స్క్రీన్ కేటాయించడం జరుగుతుంది. కనుక ఆయన తో మచ్చిక చేసుకుని తమ సినిమా లను ఆయన ద్వారా విడుదల చేసేందుకు చాలా మంది పెద్ద హీరోల సినిమాల నిర్మాతల నుండి చిన్న సినిమాల నిర్మాతల వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

chiranjeevi and balakrishna tension about dil raju sankranthi film release

సంక్రాంతి కి ఆయన భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సూపర్ స్టార్‌ విజయ్‌ వారసుడు సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనుక ఆ సినిమా కోసం మెజార్టీ థియేటర్లను బుక్ చేసి పెట్టేసాడని ఆ థియేటర్లను బ్లాక్ చేయడం వల్ల ఇప్పుడు వీర సింహా రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలకు థియేటర్లు కరువయ్యాయి అంటూ మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ చివరి వరకు కూడా దిల్ రాజు థియేటర్లను ఇవ్వక పోతే తమ సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ చిరంజీవి మరియు బాలకృష్ణ ఆందోళనతో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో నిజం ఎంత తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago