MAA Elections : ‘మా’ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ అలా చిరంజీవి ఇలా
MAA Elections : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలతో ఇండస్ట్రీ రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ విషయం అందరికీ అర్థమవుతోంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ వల్ల రెండుగా చీలిపోయింది. ఇది కాస్తా చివరకు మంచు మెగా ఫ్యామిలీ మధ్య యుద్దంలా మారింది. ప్రకాష్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చింది. ఇక మంచు ఫ్యామిలీ అయితే ఏకంగా సీనియర్ల మద్దతు కోరింది. అలా మొత్తానికి ఒకరిపై మరొకరు మాటల తూటాలను పేల్చుకున్నారు.
అయితే ఆదివారం నాడు జరుగుతున్న ఈ పోలింగ్ పెద్ద తారలంతా మొదటి సారిగా కదిలి వస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య, రామ్ చరణ్ వంటివారంతా ఓట్లు వేస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు మా ఎన్నికల్లో ఓటు వేశారు. సినిమాలు చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలి. సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదు. తిప్పి కొడితే 900ల ఓట్లు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా ?మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులే. మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా అని పవన్ కళ్యాణ్ అన్నాడు.
‘మా’ ఎన్నికల్లో ఓటు వేసిన పవన్, చిరంజీవి
ఎవరు ఎలా ఎన్ని మాట్లాడినా అవి అక్కడి వరకే ఉంటాయి.. ఆయా సమయంలో వారి భావోద్వేగాలకు అనుగుణంగా అలా మాట్లాడతారు.. చివరకు మేం అంతా ఒక్కటే అందరం కలిసి పని చేస్తాం.. ప్రజా స్వామ్యంలో ఎన్నిలు జరగడం సర్వసాధారణం, ఏకగ్రీవం కుదరనప్పుడు ఇలా ఎన్నికలు జరపడం తప్పేమీ కాదు కదా? అని చిరంజీవి మీడియాతో మాట్లాడాడు. అలా మొత్తానికి మా ఎన్నికలు మాత్రం మునుపెన్నడూ కనివినీ రీతిలో జరుగుతున్నాయి.