Bhola Shankar : చిరంజీవి భోళాశంకర్ సినిమా హిట్టా ? ఫట్టా ?

Authored By aruna | The Telugu News | Published on: August 12, 2023, 4:00 pm

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా శుక్రవారం రోజున గ్రాండ్గా విడుదలైంది. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. నడుము సీన్ అంటే మనకి ఖుషి సినిమా గుర్తొస్తుంది. ఇండస్ట్రీలో ఆ సీన్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. దాదాపుగా 21 ఏళ్ల క్రిందట నడుము సీన్ తో తమ్ముడు పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తే ఇప్పుడు అన్నయ్య చిరంజీవి సీన్ తో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఇప్పుడు భోళాశంకర్ సినిమాలో చిరంజీవి నడుము సీన్ చేశారు. ఈ సీన్ పై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది.

ఒక పాత్ర బాగా పండాలంటే ఆ పాత్రకు తగ్గట్టు నటులు దొరకాలి. అలాగే వయసు కూడా చూసుకోవాలి. జైలర్ సినిమా హిట్ అయిందంటే గొప్ప కథ కాదు, ఆ పాత్రకి రజనీకాంత్ బాగా సూట్ అయ్యారు. అదే సినిమాలో నువ్వు కావాలయ్యా పాటకు ఊపేసిన తమన్నాను ఆ పాటకు అంకితం చేశారు కానీ రజినీకాంత్ కు జోడిగా పెట్టలేదు. జోడిగా రమ్యకృష్ణని పెట్టారు. అంతేకానీ పెద్ద వయసు ఉన్న రజినీకాంత్ కు జోడిగా పెట్టలేదు. ఇక చిరంజీవి రజినీకాంత్ పదేళ్ల వయసు గ్యాప్ మాత్రం ఉంటుంది. అయినా ఇద్దరు కూడా సీనియర్ సిటిజన్స్.

అయితే భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నాను పెట్టారు. అయితే ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి తో చిరంజీవి నడుము సీన్ చేశారు. శ్రీముఖి చదువుకుంటుంటే చిరంజీవి నడుము చూస్తారు. ఈ క్రమంలోనే ఈ సీన్ పై ట్రోలింగ్ జరుగుతుంది. చిరంజీవి వయసు ఏంటి శ్రీముఖి వయసు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు తాత మనవరాళ్ల లాగా ఉన్నారు అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే ఖుషి సినిమా నడుము సీన్ ని చిరంజీవి చేయడం వలన అట్టర్ ప్లాప్ అయింది. అయితే మెగా అభిమానులు మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అంటూ చెప్పుకొస్తున్నారు.

https://youtu.be/Npl9HGSC9XU

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp