Chaitanya Vs Niharika Konidela : నవ్వుతూ కనిపించిన నిహారిక భర్త.. విడాకులిచ్చి మంచి పని చేశావ్ అంటోన్న నెటిజన్లు

Advertisement

Chaitanya Vs Niharika Konidela : మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకుల తరువాత సోషల్ మీడియాలో కామెంట్లు మారిపోయాయి. ఒకప్పుడు ఈ ఇద్దరి పోస్టులకు ఫుల్ పాజిటివ్ కామెంట్లు కనిపించేవి. ఇద్దరి జంట బాగుందని కామెంట్లు వచ్చేవి. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరి మధ్య వ్యవహారం చెడిందనే రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఉండటం లేదని, విడిపోయారంటూ రూమర్లు వచ్చాయి. అయితే వాటిపై నిహారిక, చైతన్యలు స్పందించలేదు. ఖండించలేదు. కానీ ఇన్ స్టాలో ఫోటోలు మాత్రం డిలీట్ చేయడం, ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడంతో అందరికీ క్లారిటీ వచ్చింది.

Advertisement

నిహారిక, చైతన్యలు విడాకులు తీసుకున్నట్టుగా గత నెలలో అధికారికంగా సమాచారం వచ్చింది. ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు అధికారికంగా మంజూరు కావడంతో సోషల్ మీడియాలో ఇద్దరూ పోస్టు వేశారు.పరస్పర అంగీకారంతోనే విడిపోతోన్నామని, తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని కోరారు. దీంతో ఈ ఇద్దరూ విడిపోయినట్టుగా వచ్చిన రూమర్లు నిజం అయ్యాయి. విడాకులకు సరైన కారణాలేవీ కూడా బయటకు రాలేదు.కానీ నిహారిక ప్రవర్తన వల్లే చైతన్య విడాకులు ఇచ్చారనే టాక్ ఎక్కువగా వినిపించింది.

Advertisement
chaitanya jonnalagadda pics niharika konidela gets trolled
chaitanya jonnalagadda pics niharika konidela gets trolled

ఇప్పుడు నిహారిక, చైతన్యలు ఎవరి ప్రపంచం వారిది అన్నట్టుగా ఉంటున్నారు. తాజాగా చైతన్య ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో నవ్వుతున్న ఫోటో ఒకటి ఉంది. దాని మీద నెటిజన్లు భలే కామెంట్లు చేస్తున్నారు. నిహారికకు విడాకులు ఇచ్చి మంచి పని చేశావ్.. నువ్ ఆమెతో ఉంటే.. ఇలా నవ్వుతూ ఉండేవాడివి కాదు.. నీకు ఇప్పుడు ఫ్రీడం వచ్చింది.. ఈ ఫ్రీడంను ఎలా ఎంజాయ్ చేస్తున్నావ్.. నీకు అంతా మంచే జరిగింది.. ఆమెకు దూరంగా ఉండటమే బెటర్ అని ఇలా అందరూ కూడా నిహారికనే టార్గెట్ చేశారు. చైతన్యకు ఒత్తాసు పలుకుతున్నారు. మొత్తానికి నిహారిక మీద ఎంత నెగెటివిటీ ఉందనే విషయం మరోసారి అర్థం అవుతుంది.

Advertisement
Advertisement